KTR ( image credit: setcha reporter)
Politics

KTR: విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర.. కేటీఆర్ మండిపాటు

KTR : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ₹10,000 కోట్లకు పైగా ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి, లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఆశయాలను నాశనం చేసి, తెలంగాణ విద్యావంతులైన యువతను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.

Also Read: KTR: జూబ్లీ బైపోల్‌తో కాంగ్రెస్ పాలన అంతం.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ప్రతి వర్గాన్ని మోసం

కేవలం నిర్లక్ష్యం కాదు, అణగారిన వర్గాల ఆశలను అణిచివేసేందుకు పన్నిన పన్నాగం అన్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత.. ప్రతి వర్గాన్ని మోసం చేశారు. పెన్ష‌న‌ర్లను సైతం ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు వంటి అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఇదేనా వాళ్ళు చెప్పే సంక్షేమంఅని మండిపడ్డారు.

ఇది సాధారణ ఎన్నిక కాదు

కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా ఇనిషియేటివ్” పేరుతో పేదవారి ఇళ్లను కూల్చివేస్తూ, ధనవంతులు, పలుకుబడి ఉన్నవారిని మాత్రం వదిలిపెడుతోందన్నారు. ఇది సాధారణ ఎన్నిక కాదు, కారు కు, బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. బుల్డోజర్ ప్రభుత్వాన్ని ఆపడానికి ప్రజలు కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నిక పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల గందరగోళానికి మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. తెలంగాణ భవిష్యత్తును రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: KTR: జూబ్లీహిల్స్‌లో కారుకు బుల్డోజర్‌కు మధ్యపోటీ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Just In

01

Telangana Road Accidents: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చర్యలు శూన్యం.. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో విఫలం

Rail Accident: మరో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. పలువురు మృతి

Baahubali Eternal War teaser: ‘బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1’ యానిమేషన్ టీజర్ వచ్చేసింది చూశారా..

Bhadrachalam: భద్రాచలంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు.. భూకంప జోన్‌లో ప్రాణాలకు రక్షణ కరువు!

Peddi first single: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి అప్టేట్ అదిరింది.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?