Saree Distribution: మహిళా సంఘాల్లోని సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి(Indira Gandhi’s birthday) ఉండటంతో ఆరోజూ పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లోని గోదాములకు చీరలు సరఫరా చేసినట్లు సమాచారం.
జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో..
రాష్ట్రంలో 47లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు(సెర్ప్) ఉండగా.. మెప్మా పరిధిలో పట్టణ ప్రాంతాల్లో 1.70 లక్షల సంఘాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64,69,192 మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. వీరందరికి చీరలు పంపిణీ చేస్తామని, ఏటా రెండు చీరలను ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాలకు గోదాములకు చేరుకున్నాయి. వీటిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీ సంఘాలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న చీరల పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులకు సైతం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఒక వేళ ఏదైన కారణంతో ఆగితే సంక్రాంతికి ఇచ్చేందుకు కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ రెండింటిలో ఏదో ఒక తేదీ మాత్రం ఖరారు కానుంది.
Also Read: Bandi Sanjay: మజ్లిస్ అండతోనే కిడ్నాప్, అత్యాచారాలు.. కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్!
హనుమకొండ జిల్లాలో తయారి ఆర్డర్
రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్లలో 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు. అదే విధంగా కరీంనగర్, హనుమకొండ(Hanumakonda) జిల్లాలో తయారి ఆర్డర్ ఇవ్వడంతో కంప్లీట్ చేశారు. సిరిసిల్లలో ఎక్కువ పవర్లూమ్స్ ఉండడంతో అక్కడే ఎక్కువ ఆర్డర్లు ఇచ్చారు. మొత్తం 4.34 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని అంచనా వేశారు. ఫిబ్రవరిలో మొదటి విడతలో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు, రెండో విడత ఏప్రిల్ లో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. 6,500 మంది నేత కార్మికులు చీరల తయారీచేసినట్లు సమాచారం. చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది. కార్మికులకు 18వేల నుంచి 20వేల వరకు ఆదాయం వచ్చినట్లు నేతల కార్మికులు పేర్కొంటున్నారు.
మహిళా సంఘాల సభ్యులకు..
గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించి తయారు చేయించారు. ఈ నెల 15వరకు ఇంకా ఏ జిల్లాకు అయినా చీరలు సరఫరా కాకుంటే చేయాలని అధికారులకుప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మహిళల కోసం 6.5 మీటర్ల చీరలు, వృద్ధుల కోసం తొమ్మిది మీటర్ల చీరలు రూపొందించారు. అయితే మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసే చీరలతో ప్రభుత్వంపై ఆరోపణలు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే 32 జిల్లాలకు చెందిన జిల్లా సమాఖ్య అధ్యక్షులను చీరల తయారీ యూనిట్లను పరిశీలించారు. సిరిసిల్లలోని వెంకట్రావునగర్‌లో మరమగ్గాల యూనిట్, గీతానగర్‌లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాములను సందర్శించారు. చీరలను పరిశీలించారు. చీరల తయారయ్యే విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతోనే చీరల పంపిణీకి తేదీని ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
Also Read: Hyderabad Alert: ఢిల్లీ కారు బాంబు పేలుడు నేపథ్యంలో.. హైదరాబాద్ లో హై అలర్ట్
