Bandi Sanjay: హైదరాబాద్‌లోని పాతబస్తీలో మజ్లిస్ పార్టీ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ బాలికలనే లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లు, అత్యాచారాలకు పాల్పడుతూ వారి జీవితాలను నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా పాతబస్తీ పోలీసులు కనీసం విచారణ కూడా జరపడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా మజ్లిస్ ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, పాతబస్తీలో హిందూ బాలికలు ఎక్కువగా చదువుకునే పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఆదిల్ అలియాస్ అజీజ్ ముఠా అరాచకాలు చేస్తున్నా ఇప్పటివరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు.
Also Read: Bandi Sanjay: గోదావరిఖనిలో ఆలయాల కూల్చివేత.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
చాక్లెట్లు తినిపించి
కేరళ ఫైల్స్ సినిమాను తలపించేలా పాతబస్తీలో ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికలే ఈ ముఠాకు లక్ష్యమని, మొదట ఒక బాలికను పుట్టినరోజు పేరుతో ముస్లిం అమ్మాయి ఇంటికి పిలిపించి తక్కువ డ్రగ్స్ డోసు ఉన్న చాక్లెట్లు తినిపించారని, ఆపై డోసు పెంచి వారికి అలవాటు చేశారన్నారు. ఆపై ఆ బాలికను ఆరు రోజులపాటు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బండి వివరించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు విచారణ చేయకుండా, బాలిక తిరిగి వచ్చింది కదా అని కేసును మూసివేస్తున్నారన్నారు. ఆ తర్వాత కూడా అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి, ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.
ఎందుకిలా?
ఓవైసీ చెప్పినట్లు నడవడానికి ఆయనకు అనుకూలంగా ఉండే పోలీసుల జాబితా తయారుచేసి పాతబస్తీలో పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారని సంజయ్ విమర్శించారు. ప్రధాని మోదీ ‘డ్రగ్స్ ముక్త్ భారత్’ కోసం పోరాడుతున్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూసి మైనర్ బాలికల జీవితాలను కాపాడకపోతే, పాతబస్తీలో వేలాది మంది హిందు యువకులతో రక్షక దళాలను రంగంలోకి దింపుతామని.. అదే జరిగితే యుద్ధం మొదలైనట్లేనని బండి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, చట్టానికి లోబడి కేంద్ర బలగాలను కూడా పాతబస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే తానే స్వయంగా పాతబస్తీలో పాగా వేసి ముఠా అంతు చూస్తానని, జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని సంజయ్ హెచ్చరించారు.
Also Read: Bandi Sanjay: జూబ్లీహిల్స్ ప్రచారంలో.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..?
