Bonalu Festival( image crediit: swetcha reporter)
తెలంగాణ

Bonalu Festival: సంస్కృతి సంప్రదాయాలకు.. అద్దం పట్టేలా బోనాలు!

Bonalu Festival: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఆషాడ మాస బోనాల జాతర నిర్వహణకు ఎలాంటి నిధుల కొరత లేదని, అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున రూ. 20 కోట్లు కేటాయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ , రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బోనాల ఏర్పాట్లపై జూబ్లీహిల్స్ లోని ఎంసీ హెచ్ ఆర్ డీలోని తుంగభద్ర బ్లాక్ లో మంగళవారం మంత్రులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ నెల 26 నుండి జూలై 24 

ఈ సందర్భంగా మంత్రులు పొన్నం, కొండ సురేఖ మాట్లాడుతూ ఈ నెల 26 నుండి జూలై 24 వరకు నిర్వహించు ఆషాడ మాస బోనాలను రంగ రంగ వైభవంగా నిర్వహించాలని సంబంధిత శాఖల అధికారుకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈనెల 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

జూన్ 29న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఎదుర్కోలు, 13న రంగం( భవిష్యవాణి) నిర్వహించడం జరుగుతుందని, జూలై 1న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో కళ్యాణం, పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం, జూలై 20నసింహ వాహిని మహంకాళి ఆలయం, మీరాళం మండి శ్రీ మహా కాలేశ్వర దేవాలయం, శాలిబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవస్థానం, కార్వాన్ సబ్జీ మండి శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, బల్కంపేట్శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాడ బోనాల జాతరలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

 Also Read: Muda case: సీఎం సిద్ధరామయ్యకు షాక్.. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు అటాచ్

రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తుందని అందులో దేవాలయాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, మిగతా 19 దేవాలయాల్లో ఈవోలు, దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు వారు వివరి,చారు. ఏనుగు అంబారీ ఊరేగింపు జూలై 14న శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో,20 న శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం సబ్జీ మండి, జూలై 21న అక్కన్న మాదన్న దేవస్థానం అంబారీ ఏనుగు ఊరేగింపు ఉంటుందని తెలిపారు.

భక్తులకు సురక్షిత మంచినీరు అందించాలి

ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధాన దేవాలయాల వద్ద రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని, దేవస్థాన పరిసరాలు పరిశుభ్రంగా, హైజానిక్ గా ఉండేలా శానిటేషన్ పనులు చేపట్టాలని, దేవాలయాల చుట్టూ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. భక్తులకు సురక్షిత మంచినీరు అందించాలని, నీటి ప్యాకెట్లు పంపిణీ చేయాలని, ప్రధాన ఆలయాల వద్ద నేటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచాలని జలమండలి అధికారులను మంత్రులు తెలిపారు.

జాతర జరిగే దేవాలయాలతో పాటు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, దేవాలయాల వద్ద భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఐసీడీఎస్ సహకారంతో అందించాలని మంత్రులు సూచించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందుగా దేవాలయాల్ని సందర్శించి, ప్రణాళిక ప్రకారం సిబ్బందితో పాటు ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్ల, భవనాల శాఖ ఆధ్వర్యంలో దేవాలయాలు ఇతర ప్రాంతాల్లో బారికేడ్లతో పాటు , వాటర్ ప్రూఫ్ జనరేటర్లు, షామియానాలు అలాగే మ్యాట్స్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.

 Also Read: Indiramma Housing Scheme: నిరుపేదలకి అందని.. ఇందిరమ్మ ఇండ్లు!

700 కళాకారులచే సంస్కృతి కార్యక్రమాలు

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా గత బోనాల్లో కేటాయించిన బస్సుల కంటే అధికంగా ఆర్టీసీ బస్సులను కేటాయించటం జరుగుతుందని మంత్రి పొన్నం వివరించారు. బోనాల ఉత్సవాలలో భాగంగా మన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా 700 కళాకారులచే సంస్కృతి కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నలభై దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి ఊరేగింపులో కళా ప్రదర్శనలు చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఆషాడ బోనాలు ఢిల్లీ తో పాటు విజయవాడలో కూడా నిర్వహించనున్నట్లు,అలాగే భ్రమరాంబ శ్రీశైలం దేవాలయాలను కూడా బోనాల ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి భక్తులు, ప్రజలకు వైద్య సేవలు అందాలని సూచించారు. గోల్కొండ వద్ద 6 క్యాంపులు, సీపీఆర్ ట్రైనింగ్ సెంటర్ ను,అలాగే అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని మిగతా 30 దేవాలయాల పరిధిలో మెడికల్ క్యాంపు లతో పాటు అంబులెన్స్ ను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షలో సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , డీజీపీ జితేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, పోలీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్తా, అడిషనల్ డీజీ ఎం ఎం భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, టీఎస్ఎస్ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి ఎస్ జగన్ వివిధ శాఖల ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పండుగ‌కు ముందే అన్ని క్లియర్: మంత్రల క్లారిటీ
దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ, ఎండోమెంట్ శాఖల సమన్వయంతో పండుగకు ముందే క్లియర్ అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు. అధికారులు రొటీన్ ఉద్యోగం లా కాకుండా సేవ దృక్పథంతో పని చేయాలని మంత్రులు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో దేవాలయ నిర్వాహకులతో ఆషాడ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం దేవాలయాల కమిటీలతో మంత్రులు సమావేశం నిర్వహించారు.

శాంతి, భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా పోలీసులు అన్ని శాఖ‌ల‌తో సమన్వయం చేసుకోవాలని, అధికారులు ఎక్కడా లోపాలు త‌లెత్త‌కుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో జరిగిన ఈ ఆషాడమాస బోనాల రివ్యూ మీటింగ్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆల‌య క‌మిటీల‌ చైర్మన్లు, సభ్యులతోనూ సమావేశం కొనసాగింది.

 Also Read: Minister Seethakka: రాష్ట్రంలో 38 ఆసుపత్రుల్లో.. సదరం సర్టిఫికెట్లు!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు