Kodanda Reddy: రైతు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఐనప్పటి నుండి రైతులకోసం ఆలోచన చేస్తున్నాడని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండవ రోజు కొనసాగుతున్న తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటుచేసిన 150 కి పైగా స్టాల్ లను సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. రైతే పెద్ద శాస్త్రవేత్త అని, ధరణి తో లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారని అన్నారు. నకిలీ సీడ్ వల్లనే రైతులు నష్టపోతున్నారని,అందుకు రైతుకు విత్తన హక్కును కల్పించే దిశగా, విత్తన చట్టం తీసుకురాబోతున్నారని అన్నారు.
రైతు పండుగలను చేసుకున్నాం
ములుగులో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు మొక్క జొన్న విత్తనోత్పత్తి చేసి రైతులను ఆగం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. త్వరలో విత్తన చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకొని కమిటీ వేశారన్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్, నిజామాబాద్ లో రైతు పండుగలను చేసుకున్నామని, ఇప్పుడు హుస్నాబాద్ లో రైతు మహోత్సవం జరుగుపుకుంటున్నా తెలిపారు. రైతుకు సెలవు ఉండదని, పండుగైన పబ్బమైన సాగు లోనే ఉంటాడని,సాంప్రదాయ పంటలు సాగుచేయాలన్నారు.
Also Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!
రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచారు
యాంత్రీకరణ అవసరమని, ఆ దిశగా రైతులు ఆలోచన చేసి ముందుకు సాగాలని రైతులకు సూచించారు. ఆనాడు వైఎస్ రుణమాఫీ చేస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచారన్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ వల్ల చాలా మంది రైతులు లాభపడ్డారని, రైతు కమిషన్ వచ్చి 6నెలలు అయ్యింది, చాలా పనులు చేశామని,ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు పండుతాయో అక్కడ ఆయా మార్కెట్లు ఉండాలని రైతు కమిషన్ సూచించిందన్నారు.
రైతుకు అండగా నిలబడాలి
కేంద్రం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రాజకీయాలు చేయడం మానేసి రైతుకు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ మెంబర్లు కేవీయన్ రెడ్డి, భవాని రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగ్రవాల్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, జిల్లాలోని పలు మండలాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Series of thefts: మంచితనం ముసుగులో వరుస దొంగతనాలు