Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా
Wine Shop Lottery (imagecredit:swetcha)
Telangana News

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Wine Shop Lottery: వచ్చే రెండేళ్ల కాలానికి వైన్​ షాపు(Wine Shop)లను కేటాయించేందుకు నేడు లక్కీ డ్రా(Lucky draw) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, రూ. 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకున్నవారు ఎవరికి షాపులు దక్కుతాయోనని టెన్షన్​ పడుతున్నారు. లాటరీలో తమకే షాపు దక్కాలని కోరుకుంటూ ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఇష్ట దైవాలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

త్వరలోనే ముగియనున్న గడువు..

రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 వైన్ షాపులు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న షాపుల లైసెన్స్​(License) గడువు త్వరలోనే ముగియనున్నది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారులు(Excise officersz) ఇటీవల వైన్​ షాపులను కేటాయించేందుకు నోటిఫికేషన్​ ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు. దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో 2,620 షాపులకు గాను 95,137 దరఖాస్తులు వచ్చాయి. ముందుగా నిర్ణయించినట్టుగా సోమవారం వైన్​ షాపులను కేటాయించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉదయం 11 గంటల నుంచి డ్రా నిర్వహించనున్నారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

హైకోర్టులో పిటిషన్లు

కాగా, వైన్​ షాపుల కోసం దరఖాస్తుల గడువును పెంచుతూ కొంతమంది హైకోర్టు(High Cort)లో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, వైన్​ షాపు(Wine Shop)లను కేటాయించేందుకు డ్రా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దాంతో ప్రొహిబిషన్(Prohibition), ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్​(Excise Commissioner Harikiran) ఆయా జిల్లాల్లో డ్రా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించారు.

Also Read: Adivasi Protest: లంబాడీలకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..