DGP Shivadhar Reddy: పునరాగమనంలో అదరగొడుతూ, నోయిడా వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి జువాన్ యి గువోపై విజయం సాధించి, స్వర్ణ పతకం సాధించిన భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌పై (Nikhath jarin) సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), పలువురు మంత్రులు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సహా పలువురు అభినందనలు తెలుపగా, తాజాగా ఆ జాబితాలో తెలంగాణ డీపీజీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) కూడా జారీ చేశారు.
ఈ విజయం నిఖత్ జరీన్ సామర్థ్యం, కృషి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. బంగారు పతకం సాధించినందున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నిఖత్ గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిందని మెచ్చుకున్నారు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని అన్నారు. తెలంగాణ పోలీస్ కుటుంబ తరపున నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలు అందుకోవాలంటూ శివధర్ రెడ్డి ఆకాంక్షించారు. కాగా, తెలంగాణ స్పెషల్ పోలీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నిఖత్ బాధ్యతల్లో ఉన్నారు.
Read Also- Crime News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. యువతి ప్రేమ కోసం ఇద్దరు యువకులు నడిరోడ్డుపై కత్తులతో దాడి..?
కాగా, వరల్డ్ బాక్సింగ్ కప్‌లో శుక్రవారం జరిగిన 51 కేజీల కేటగిరి ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ బాక్సర్‌ను 5–0తో నిఖత్ జరీన్ మట్టికరిపించింది. భుజం గాయంతో ఏడాది పాటు బాక్సింగ్ రింగ్‌కు దూరంగా ఉన్న జరీన్ ఈ గెలుపుతో అద్భుత రీతిలో పునరాగమనాన్ని అందుకున్నట్టు అయింది. చివరిసారిగా 2024 ఫిబ్రవరి నెలలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఈ విజయంతో దాదాపు రెండేళ్ల తర్వాత ఆమె తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించినట్టు అయింది.
వరల్డ్ బాక్సింగ్ కప్‌లో అద్భుత ఆటతీరు కనబరిచిన నిఖత్ జరీన్‌పై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు, కేటీఆర్ వంటి రాజకీయ ప్రముఖులు అభినందలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ స్పందిస్తూ, ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి దేశ ఖ్యాతిని జరీన్ పెంచిందని మెచ్చుకున్నారు. ఆమె అసాధారణ గెలుపు యువతకు, యువ క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్యూచర్‌లో కూడా జరీన్ మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. కేటీఆర్ స్పందిస్తూ, కఠోర శ్రమ, పట్టుదల భారత్‌కు, తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్నాయని మెచ్చుకున్నారు. వెంకయ్య నాయుడు స్పందిస్తూ, తెలంగాణ బిడ్డ నిఖత్ తన పంచ్‌లతో స్వర్ణం గెలిచిందని, భారత బాక్సర్లు దేశం గర్వించేలా చేస్తున్నారని ప్రశంసించారు.
Read Also- Traveller: 197 దేశాలను చుట్టొచ్చాడు.. వరస్ట్ నగరం ఎప్పటికీ అదేనట.. ఎందుకో తెలిస్తే షాకే!
