Crime News: ఓ యువతి ప్రేమ కోసం ఇద్దరు యువకుల గొడవ పడ్డారు. తమిళనాడుకు చెందిన ఓ యువకుడిపై శ్రీ చైతన్య(Sri Chaitanya) అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. అయితే ఓ యువతి ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. తమిళనాడు యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆగ్రహానికి లోనైన చైతన్య అనే యువకుడు మరొ యువకుడిపై కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు.
Also Read: Mahesh Kumar Goud: నక్సల్ ప్రశ్నిస్తే దేశద్రోహి ముద్రేనా? పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
వివల్లోకి వెలితే..
విశాఖ లోని సిరిపురం అతిథి గృహం వద్ద ఈ సంఘటన జరిగింది. అయితే ఓ యువతి ప్రేమ కోసం ఇద్దరు యువకులు దారుణంగా గొడవపడ్డారు. ఓ యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. గుట్టు చప్పుడు కాకుండా యువతి వారిద్దరితో ప్రేమాయణం చేయడం వలన ఈ సంఘటనజ జరిగింది. తమిళనాడుకు చెందిన యువకుడిని పెళ్లిచేసుకుంటాను అని యువతి శ్రీ చైతన్యతో తెలిపింది. దీంతో ఆగ్రహనికి గురైన శ్రీచైతన్య తమిళనాడు యువకుడి పై తీవ్రకోపంతో రగిలి పోయాడు. దీంతో వీరిద్దరు ఓకరిపై ఓకరు నడిరోడ్డుపై అతి దారుణంగా దాడి చేసుకున్నారు. అనంతరం తీవ్ర ఆగ్రహనికి గురైన శ్రీ చైతన్య(Sri Chaitanya) తమిళనాడు యువకుడి పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర అస్థ్వతకు గురైన యువకుడిని అక్కడి స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాడిచేసిన చైతన్య స్వస్థలం విజయనగరం(Vijayanagaram)లోని భోగాపురం(Bhogapuram)గా పోలీసులు గుర్తించారు. యువతి యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.
యువతి ప్రేమ కోసం ఇద్దరు యువకుల గొడవ
తమిళనాడుకు చెందిన యువకుడిపై కత్తితో దాడి చేసిన చైతన్య
ఇద్దరితో ప్రేమాయణం నడిపిన యువతి
తమిళనాడు యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆగ్రహానికి లోనై కత్తితో దాడి చేసిన చైతన్య
చైతన్య స్వస్థలం విజయనగరంలోని భోగాపురం
యువతి, యువకులను… pic.twitter.com/5E3unDXghm
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2025
Also Read: CM Revanth Reddy: తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణి చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
