Sunil Kumar Arrest: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ ను పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్గొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రూ.28 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (Directorate General of GST Intelligence) ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అయితే పన్ను ఎగవేతకు సంబంధించి గతంలో నోటిసులు పంపినప్పటికీ సునీల్ కుమార్ పట్టించుకోలేదని తెలుస్తోంది.
సీజీఎస్టీ చట్టం – 2017 ప్రకారం..
సునీల్ కుమార్ కాంగ్రెస్ నేతగానే కాకుండా ప్రముఖ బస్ ట్రాన్స్ పోర్ట్ సంస్థ ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels)కు ఓనర్ గానూ వ్యవహరిస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది పన్ను ఎగవేసిన వ్యక్తులు, సంస్థలు, కంపెనీలపై డీజీజీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఆరెంజ్ ట్రావెల్స్ నిర్వాహకుడు సునీల్ రెడ్డితో పాటు ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎండీ ఎన్. చేతన్ (రూ.22 కోట్లు) పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. దీంతో సీజీఎస్టీ చట్టం – 2017లోని నిబంధన ప్రకారం సునీల్ కుమార్, చేతన్ లను అరెస్టు చేశారు.
నోటీసులు పంపినా పట్టించుకోలే..!
పన్ను ఎగవేతకు జీఎస్టీ అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సురేష్ కుమార్ తో పాటు చేతన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. ఈ క్రమంలో జీఎస్టీ ఎగవేత దారులపై ఫోకస్ పెట్టిన అధికారులు.. పన్ను ఎగ్గొట్టి మౌనంగా ఉండిపోయిన వారిపై దేశవ్యాప్తంగా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే సురేష్ కుమార్, చేతన్ అరెస్టులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పన్ను ఎగవేతకు సంబంధించి వారిద్దరిని డీజీజీఐ అధికారులు విచారిస్తున్నారు. జీఎస్టీ చెల్లించకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read: Congress Party: కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అంశం మరోసారి చర్చ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలో పక్కా వ్యూహం!
అరెస్టు వెనుక బీజేపీ ఎంపీ?
కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ విషయానికి వస్తే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బాల్గొండ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతూ వస్తోందన్న భావనలో సునీల్ కుమార్ ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు తనకు ఉన్న వ్యాపారాల రిత్యా బీజేపీలో చేరాలని ఆయన ప్రయత్నాలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ గట్టిగా అడ్డుపడటంతో ఆయన పార్టీ మారలేకపోయారన్న ప్రచారం నియోజకవర్గంలో జరిగింది. తాజాగా సురేష్ కుమార్ అరెస్టు నేపథ్యంలో ఆ ఎంపీ పైనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్టు వెనుక అతడి ప్రమేయ ఏమైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

