Liquor Shops (imagecredit:twitter)
తెలంగాణ

Liquor Shops: రాష్ట్రంలో మరో 19 కొత్త మద్యం షాపులకు నేడు నోటిఫికేషన్..!

Liquor Shops: తెలంగాణ రాష్ట్రంలో 2601 మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ డ్రా పద్ధతిలో ప్రశాంతంగా పూర్తయింది. ఈ డ్రా సమయాల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. రాష్ట్రంలోని మొత్తం 2620 మద్యం షాపుల కోసం ప్రభుత్వం ఆహ్వానించగా.. ఏకంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ భారీ స్పందన కారణంగా దరఖాస్తు రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ. 2845 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఈ గణనీయమైన మొత్తం ప్రభుత్వ ఖజానాకు అదనపు బలాన్ని చేకూర్చింది. తెలంగాణ(Telangana)లోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో డ్రా ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు దరఖాస్తుదారుల సమక్షంలోనే డ్రా ద్వారా విజేతల పేర్లను ప్రకటించారు. ఈ పద్ధతి ద్వారా కేటాయింపుల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చూసుకున్నారు. మద్యం దుకాణాల డ్రాను సమర్థవంతంగా, ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా నిర్వహించినందుకు గాను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్(Commissioner Harikira) ఎక్సైజ్ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కొత్త లైసెన్సు దారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతున్నది.

19 మద్యం షాపులకు రేపు నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా 19 మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీ హరి కిరణ్ ఈ మేరకు సంబంధిత జిల్లాల ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఐదు ఎక్సైజ్ జిల్లాల్లో మొత్తం 19 మద్యం షాపులకు లైసెన్సులను జారీ చేయనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 7 మద్యం షాపులకు, అదిలాబాద్ జిల్లాలో 6 షాపులకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దీంతోపాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 3, సంగారెడ్డి జిల్లాలో ఒక మద్యం షాపునకు లైసెన్సులు కేటాయించనున్నారు. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 28 నుంచి నవంబర్ 1 వరకు కొనసాగనుంది. దరఖాస్తుల గడువు ముగిసిన అనంతరం, నవంబర్ 3న 19 మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులకు డ్రా (లాటరీ) నిర్వహించబడుతుంది. డ్రా ద్వారా ఎంపికైన అభ్యర్థులకు లైసెన్సులు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తుల రుసుము రూపంలో ఆదాయం సమకూరనుంది. 

Also Read: Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

భార్యాభర్తలు తండ్రి కొడుకులకు దక్కిన కిక్‌ లక్కు

సూర్యాపేట జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్‌కు ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం గెజిట్ నెంబర్ 21 షాపు దక్కింది. అదేవిధంగా ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 షాపు దక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. భార్యాభర్తలకు అదృష్టవశాత్తు రెండు షాపులు దక్కాయి. మహబూబాబాద్ జిల్లాలో మరిపెడకు గోట్ల వెంకన్నకు గెజిట్ నెంబర్ 31వ షాపు దక్కగా, ఆయన కుమారుడు రాకేష్ యాదవ్‌కు గెజిట్ నెంబర్ 12 షాపు వరించింది. ఇక ఆ రెండు కుటుంబాల్లో సంతోషం వెళ్లి విరిసింది. ఓ కుటుంబంలో భార్య భర్తలకు, మరో కుటుంబంలో తండ్రి కొడుకులకు మద్యం షాపులు వరించడంతో వారిని తమ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేకంగా అభినందించారు.

హైదరాబాద్ 82, సికింద్రాబాద్ 97 మద్యం షాపుల కేటాయింపు

హైదరాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సులను పారదర్శకంగా డ్రా పద్దతిలో కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వెల్లడించారు. సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో లాటరీ పద్దతిలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ హరి చందన దాసరి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 202527 రెండు సంవత్సరాలకు గాను వైన్ షాపుల కేటాయింపులను డ్రా పద్ధతితో నిర్వహిస్తున్నట్లు వివరించారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని 3,022 దరఖాస్తుల అందగా, గెజిట్ సీరియల్ నెంబర్ ద్వారా 97 మద్యం షాపులను కేటాయించామన్నారు. అలాగే హైదరాబాద్(Hyderabad) డివిజన్‌లో 3,201 దరఖాస్తులు అందగా, 82 మద్యం షాపులను అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. ముకుంద రెడ్డి(Mukunda Reddy) ఆధ్వర్యంలో డ్రా పద్ధతి ద్వారా కేటాయించామన్నారు.

నూతన ఎక్సైజ్ పాలసీ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా కేటాయింపు ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని మొత్తం 179 మద్యం షాపులకు గాను 6,223 దరఖాస్తులు అందగా, ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ డ్రా పద్ధతి ద్వారా టోకెన్స్ తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశామన్నారు. డ్రా కోసం వినియోగించిన టోకెన్‌లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా చేపట్టడం జరిగిందన్నారు. డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫొటో, వీడియోలుగా చిత్రీకరించినట్లు, పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. డ్రాలో వరించి మద్యం షాపులు దక్కించుకున్నవారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వద్దనే అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు.

Also Read: Harish Rao: ఆటో డ్రైవర్లు అంటే పట్టదా.. హమీ ఇచ్చి పట్టించుకోరా.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

Just In

01

Mahabubabad: ఆ జిల్లాలో ఒక్క మద్యం షాపు విలువ ఎన్ని లక్షలో తెలుసా?

Cyclone Montha: మొంథా అంటే అర్థం ఏమిటి? ఈ పదాన్ని ఎవరు సూచించారో తెలుసా?

Bhatti Vikramarka: విద్యుత్ ప్రమాదాలకు చెక్.. రూ.27.76 కోట్లతో ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

CYCLONE MONTHA: మరికొన్ని గంటల్లోనే ‘మొంథా తుపాను’ బీభత్సం.. ఈ ఏరియాల్లో ఉండేవారికి బిగ్ అలర్ట్

Jubliee Hills Bypoll: జూబ్లీలో పోలింగ్ పెంచేందుకు కొత్త ప్లాన్.. రంగంలోకి యూసీడీ, స్వయం సహాయక బృందాలు!