rashika-journey( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి తెలియని వారుండరు. ఆమె కోసమే సినిమాలకు వెళ్లే ఫ్యాన్ కూడా ఉంటారు. చిన్న నటిగా ప్రారంభమై ఇప్పుడు సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా ఎదిగారు. తాజాగా ఆమె ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రష్మిక మందన. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక మందన.

Read also-Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..

వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రష్మిక మందన నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, థామా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. అయితే బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని చెబుతుంటుంది రష్మిక మందన. ఈ అందాలతార తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లో రశ్మిక పర్ ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోందనే ప్రెడిక్షన్స్ ట్రైలర్ సక్సెస్ తో ఏర్పడుతున్నాయి.

Reada lso-Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

గీతా గోవిందం, పుష్ప సిరీస్, అనిమల్ వంటి హిట్లతో బాక్సాఫీస్ రష్మిక మందాన సౌత్ ఇండియా క్వీన్ గా ఎదిగారు. ఓ నివేదిక ప్రకారం సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నాయికల్లో ఈమె అగ్ర స్థానంలో ఉంది. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. డియర్ కామ్రేడ్, హిస్టారికల్ రోల్స్ (చావా) వంటివి వంటి విభిన్న మైన సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటారు. అంతే కాకుండా ఆమె నటనకు గాను అనేక అవార్డులు ఆమె సొంతం అయ్యాయి. ఇలా ఎంచుకున్న ప్రతి సినిమాను ఎంతో బాధ్యతతో తన ఎఫర్ట్ మెత్తం పెట్టి చేస్తుంది కాబట్టే సౌత్ ఇండియాలో ఆమె క్వీన్ గా ఎదగగలిగింది.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?