CM Revanth Reddy: ఆదే దేవుడు గణనాథుడి ఆశీర్వాదం అందరీకి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆకాంక్షించారు. ఏకంగా 71 ఏళ్లుగా ఏ మాత్రం తగ్గకుండా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించటం అభినందనీయమని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీని అభినందించారు. ముఖ్యమంత్రి ఖైరతాబాద్(Khairatabad) లోని భారీ గణపయ్యను దర్శించుకుని పూజాధికాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) మాట్లాడుతూ దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతి అని చర్చించుకునేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నగరంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని, కానీ మన రాష్ట్రంలో గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ అందించింది భక్తితో ఉత్సవాలు నిర్వహించుకునే అవకాశం, ఏర్పాట్లు కల్పించినట్లు ఆయన వ్యాఖ్యానించారు.
ఆనందోత్సవాలకు ప్రతీకగా జరుపుకోవాలి
ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి లోటుప్లాట్లు కలగకుండా చూస్తున్నామని వివరించారు. అన్ని మతాలను గౌరవిస్తూ హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి పూజలందుకున్న గణనాథుడి నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాలకు ప్రతీకగా జరుపుకోవాలని సీఎం సూచించారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శనం
రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోనే గణేష్ మండపాల కు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైన ప్రభుత్వం మనదేనని తెలిపారు. ఖైరతాబాద్ మహా గణపతిని దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు పాడిపంటలు, సుఖ సంతోషలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజా పాలనలో ప్రజలకు మరింత సేవచేసేలా, రాష్ట్ర అభివృద్ధికి ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. హైదరాబాద్ బోనాలు, ఇప్పుడు గణేష్ ఉత్సవాలు , మరో 15 రోజుల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, శాసనసభ్యులు దానం నాగేందర్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ , జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ సాయిరాం, ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్తమ్ చంద్ జైన్, రాజ్ కుమార్, అశోక్, కృష్ణ యాదవ్, రాజేంద్ర యాదవ్, మహేష్ యాదవ్, గజ్జల నగేష్, మోతీలాల్ జైన్, అనిల్ కుమార్, విద్యుత్, మెడికల్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ, రెవెన్యూ శాఖలకు సంబందించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన సందడి.. వాహనదారులకు ట్రాఫిక్ సీపీ కీలక సూచనలు