Telangana Cabinet Meeting: ఈ నెల 4వ తేదీన క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపైనే చర్చించనున్నారు. పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టుపై అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ప్రభుత్వం క్యాబినెట్ ముందు ఉంచనున్నది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల( BC Reservations)అమలుపై డిస్కషన్ చేయనున్నారు.
Also Read: Harish Rao: కాళేశ్వరానికి చిల్లు పెడతామంటే చూస్తూ ఊరుకోం
అభిప్రాయ సేకరణ
ఢిల్లీలో మూడు రోజుల పాటు అనుసరించాల్సిన వ్యహాలపై చర్చించనున్నారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్, కేంద్రంలోని పెద్దలపై పెట్టాల్సిన ఒత్తిడి వంటి అంశాలన్నింటిపై మంత్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరగనున్నది. ఈ తర్వాత ఢిల్లీలో చేపట్టాల్సిన బీసీ రిజర్వేషన్ల అమలు కార్యక్రమాల నిమిత్తం సీఎం, మంత్రులు బీజీ కానున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Also Read: Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సినిమాకు జాతీయ అవార్డు