RTA Check Posts (imagecredit:swetcha)
తెలంగాణ

RTA Check Posts: రవాణా చెక్ పోస్టులు ఎత్తివేస్తూ జీవో జారీ.. అయినా ఆగని దందా..!

RTA Check Posts: రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో రవాణా చెక్ పోస్టులను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చి సుమారు మూడునెలలు అవుతున్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తొలగించలేదు. కొంతమంది అధికారులు కావాలని వాటిని కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 6 నెలల పాటు వాహనదారులకు అవర్ నెస్ కల్పించాలని పేర్కొనడంతో దానిని అడ్డంపెట్టుకొని కొంతమంది రవాణాశాఖ అధికారులు చెక్ పోస్టులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాహనదారుల నుంచి నిబంధనలకు విరుద్దంగా వసూల్లు చేస్తున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అవగాహన కల్పించకుండా కేవలం మామూళ్లపై దృష్టిసారించారనే ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్ర సరిహద్దలుల్లో 14 చెక్ పోస్టులు

రాష్ట్రంలోని సరిహద్దుల్లో 15 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో రాష్ట్ర సరిహద్దలుల్లో 14 చెక్ పోస్టులు, కామారెడ్డిలో ఒకటి ఇంట్రా స్టేట్ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. సాలూరా(నిజామాబాద్), ఆదిలాబాద్, జహీరాబాద్(సంగారెడ్డి), మద్నూరు(కామారెడ్డి), బైంసా(నిర్మల్),వాంకిడి(కొమ్రంబీం ఆసిపాబాద్), అలంపూర్(జోగులాంబ), కృష్ణుడు(నారాయణపేట), విష్ణుపురం, నాగార్జునసాగర్(నల్లగొండ), కోదాడ(సూర్యాపేట), కల్లూరు(ఖమ్మం), అశ్వరావుపేట, పాల్వంచ(భద్రాద్రికొత్తగూడెం), కామారెడ్డిలో ఇంట్రాస్టేట్ చెక్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేయడంతో పాటు జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అయితే చెక్ పోస్టుల్లో నిబంధనలకు విరుద్దంగా డబ్బాలు పెట్టి మామూళ్లు వసూల్లు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు ఏపీలో సైతం గతేడాది చెక్ పోస్టులను ఎత్తి వేస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోనూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెక్ పోస్టులను ఎత్తివేస్తూ మూడు నెలల క్రితం జీవో జారీ చేసింది.

6 నెలల ఎన్ పోర్స్ మెంట్ సాకుతో..

చెక్ పోస్టులపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటంతో ఎత్తివేతకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూలై 28న కేబినెట్ చెక్ పోస్టులు ఎత్తివేయాలని అప్రూవల్ చేసింది. ఆగస్టు 28న ప్రభుత్వం 6 నెలల పాటు ఎన్ ఫోర్స్ మెంట్ చేయాలని జీవోలో పేర్కొంది. అంతేకాదు ప్రతి చెక్ పోస్టు వద్ద వాహనదారుల అవగాహన కోసం బ్యానర్లు పెట్టాలని, అవగాహన కల్పించాలని కమిషన్ వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఇతరరాష్ట్ర వాహనాలు తెలంగాణకు వచ్చేటప్పుడు ఆన్ లైన్ లోనే రహదారి పీజు చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల పన్ను, టెంపరరీ పర్మిట్లు, రుసుముల చెల్లింపు ప్రక్రియా అంతా మ్యాన్ వల్ గా కాకుండా ఆన్ లైన్ లోనే ముందస్తుగా తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఆ వివరాలపై ప్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. అయితే జీవోలో ఇచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది రవాణాశాఖ అధికారులు మాత్రం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడు నెలలు అవుతున్నా చెక్ పోస్టులు కొనసాగించడంపై పలువురు మండిపడుతున్నారు.

Also Read: Telangana BJP: బీజేపీలో నెక్స్ట్ వికెట్ ఎవరు?.. జిల్లా అధ్యక్షుల పంచాయితీపై ఉత్కంఠ

కొనసాగుతున్న దందా?

ప్రతీ వాహనం నుంచి చెక్ పోస్టుల వద్ద వంద నుంచి వసూల్లు చేస్తున్నారనే ఆరోపణలు మళ్లీ వస్తున్నాయి. గతంలో వస్తుండటంతో వాటికి ఉన్నతాధికారులు నిఘా ఏర్పాటు చేయడం, ప్రభుత్వం ఎత్తివేతకు నిర్ణయం తీసుకోవడంతో కొంత సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు ఎత్తివేతకు గడువు దగ్గర పడుతుండటంతో , మరో 3 నెలలు మాత్రమే ఉండటంతో వసూల్లకు రవాణాశాఖ సిబ్బంది తెరదీసినట్లు ప్రచారం ఊపందుకుంది. దీనికి ఉన్నతాధికారులు సైతం సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఏకకాలంలో 12 చెక్ పోస్టులపై ఏసీబీదాడులు

ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఆర్టీఏ అధికారులు లారీ డ్రైవర్ల నుంచి, రవాణా వాహనాల క్లీనర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూల్లు చేసేందుకు ప్రైవేటు వ్యక్తులను నియమించారనే ఆరోపణలు వస్తున్నాయి. వారు వసూల్లు చేసి ప్రైవేటు వ్యక్తుల వద్ద అధికారులు డబ్బులను దాస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు ఈ నెల 18 అర్ధ రాత్రి నుంచి 19తేదీ వరకు ఏకకాలంలో 12 చెక్ పోస్టులపై దాడులు నిర్వహించారు. ఆలంపూర్(గద్వాల), నాగార్జునసాగర్(నల్లగొండ),సాలూరా(నిజామాబాద్) ఈ మూడు చెక్ పోస్టులు మినహా అన్ని చెక్ పోస్టుల్లోనూ దాడులు నిర్వహించారు. ఆర్టీఏ చెక్ పాయింట్ల వద్దకు వచ్చే డ్రైవర్లు నగదు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 4లక్షల 18వేల 880 రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులను సైతం ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

గతంలో హెచ్చరించినా..

చెక్ పోస్టుల్లో నిబంధనలకు విరుద్దంగా వసూల్లు చేస్తున్నారనే ఆరోపణలతో గతంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు సైతం కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాదు ఏసీబీ అధికారులు 1064 టోల్ ఫ్రీ నెంబర్ ను సైతం ప్రకటించారు. మరోవైపు 9440446106 వాట్సాప్ కు వివరాలు తెలియజేయాలని సూచించారు. అయినప్పటికీ చెక్ పోస్టుల్లో మాత్రం వసూల్లు కొనసాగుతుండటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో చెక్ పోస్టులను తొలగిస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

Also Read: Akhanda 2: ఆ సినిమాల సక్సెస్‌తో ‘అఖండ 2’పై క్రేజ్ తగ్గుతుందా?

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్