ACB Raids: రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసే అవినీతి అధికారులు రూ.కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ ఆదాయానికి మించిన కేసుల్లో అడ్డంగా బుక్కైపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు ఏసీబీ అధికారులు విస్తృతమైన దాడులు చేస్తున్నప్పటికీ లంచావతారాలు మాత్రం కొత్త అవతారం ఎత్తుతూ అధికారుల కే సవాల్ గా మారుతున్నారు. ఇప్పటివరకు 2025లో 220 కేసుల్లో వినియోగదారుల నుంచి వివిధ కార్యాలయాల్లో వినియోగదారుల పనులు చక్కబెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వారు మాత్రమే ఎక్కువగా ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. అధికారికంగా అవినీతి జరుగుతుందని కార్యాలయాలపై దాడులు చేసిన కేసులు దాదాపు 100 వరకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక లంచాలు తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కకుండా తప్పించుకునే అధికారుల శాతం లంచాలు తీసుకున్న వారి కంటే ఎక్కువగానే ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు 150 మందికి పైగా అరెస్ట్
ఇప్పటివరకు 150 మందికి పైగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వినియోగదారుల నుంచి లంచాలు తీసుకున్న వారి సంఖ్య ఇప్పటివరకు ఎక్కువగానే కనిపిస్తోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్టుగా తెలంగాణ రాష్ట్ర గణాంకాలే చెబుతున్నాయి. 2024లో 152 కేసులు నమోదైతే అందులో 223 మంది అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. లంచావతారాల్లో అత్యధికంగా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌డ్‌గా చిక్కారు. అంతేకాకుండా కీలక శాఖలో పనిచేస్తున్న అధికారులు కూడా లంచాలకు రుచి మరిగి తమ పనులను చక్కపెట్టుకుంటున్నారు. ఇలాంటి అధికారులు ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వమే అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ అధికారులకు సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్, ఇతర శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్ట్ లను ఎత్తివేసినప్పటికీ ఆయా శాఖల్లో పని చేసే సిబ్బంది చేతివాటం మరింతగా పెరిగినట్లుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఆర్టీవో కార్యాలయాలపై సస్పెక్స్ చెక్
ఆర్టీవో కార్యాలయాల్లో సస్పెక్ట్ చెక్స్ చేస్తూ వారి వద్ద అక్రమంగా లభించిన నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు, సిబ్బందిపై ప్రత్యేక నిఘా ఉంచుతూ వారిని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని విచారణలు చేపడుతున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా 30 లక్షల పైగా నగదు లభ్యమైనది. అంతేకాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన లిక్కర్ బాటిల్స్ కూడా అధికంగా ఏసీబీ అధికారులకు లభ్యమయ్యాయి. ఈ విషయాలపై అదనపు కలెక్టర్ ను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతను కలెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు తమ అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
Also Read: Indo – Pak Border: డ్రగ్స్ మత్తులో.. పాక్‌లోకి వెళ్లిన యువకుడు.. అక్కడి ఆర్మీ ఏం చేసిందంటే!
తాజాగా ఖమ్మం ఆర్టీవో కార్యాలయం పై ఏసీబీ దాడులు
తాజాగా ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఖమ్మం ఏసీబీ అధికారి వై రమేష్(Y Ramesh) నేతృత్వంలో ఏసీబీ(ACB) బృందం సస్పెక్ట్ చెక్ చేయడంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టగా వివిధ రకాల డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పనుల నిమిత్తం 15 మంది ఏజెంట్ల ద్వారా అక్రమంగా రూ. 70 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఏసీబీ డీఎస్పీ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏసీబీ విభాగాలపై క్షేత్రస్థాయి సిబ్బందిపై కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ పై ఏసీబీ అధికారులు ప్రత్యేక నజర్ వేసి నిఘాతో వ్యవహరిస్తున్నారు. ఖమ్మం ఆర్టీవో కార్యాలయం కదలికపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇంకా అవినీతి జరిగే కార్యాలయాలపై నిఘా ఉంచుతూ దాడులు చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
మహబూబ్ నగర్ డిటిసి కిషన్ నాయక్ పై ఏసీబీ అధికారుల దాడులు
మహబూబ్నగర్ డిటిసి కిషన్ నాయక్ కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు అందులో డాక్యుమెంట్స్ విలువ రూ.12.72 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ. 250 కోట్ల విలువ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు తమ దూకుడును ప్రదర్శిస్తున్నారు.
Also Read: The Raja Saab: ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ గిఫ్ట్.. ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో.. ఇక ప్రేయర్లే!

