The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) అభిమానులకు ఈ ఏడాది క్రిస్మస్ పండుగ చాలా స్పెషల్‌గా మారింది. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ చిత్రం నుంచి ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ‘రాజే యువరాజే..’ (Raje Yuvaraje Promo) అనే పాట ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులకు, ప్రేక్షకులకు చిత్ర యూనిట్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ సింగిల్ విషయంలో కాస్త మిశ్రమ స్పందన వినిపించినా, ట్రైలర్, సెకండ్ సాంగ్ సినిమాపై భారీగా హైప్‌ని పెంచేశాయి. ఈ క్రమంలో క్రిస్మస్‌ను పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్‌ని ఈ ప్రోమో రూపంలో వదిలారు.
Also Read- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు
హృదయాన్ని హత్తుకునే సాంగ్ ప్రోమో
తాజాగా విడుదలైన ఈ సాంగ్ ప్రోమోని గమనిస్తే.. ఇందులో ప్రభాస్ అత్యంత స్టైలిష్‌గా, క్లాసీగా కనిపిస్తున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఆయన చేసే ఏర్పాట్లు, పండుగ సందడిని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ముఖ్యంగా ప్రభాస్ చర్చికి వెళ్లి హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కలిసి ప్రేయర్ చేయించే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట ప్రోమో చూస్తుంటే, సినిమాలో పండుగ వాతావరణాన్ని, ఎమోషన్స్‌ను దర్శకుడు మారుతి అద్భుతంగా పండించినట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఈ పాట ఫుల్ వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సంక్రాంతి బరిలో రాజసం
బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి ‘ది రాజా సాబ్’ సిద్ధమవుతున్నాడు. జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రం హారర్ కామెడీ జానర్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సృష్టిస్తుందని చిత్ర యూనిట్ మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, బొమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో నిర్మింస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ మార్క్ ఎనర్జీ, మారుతి మార్క్ కామెడీ మిళితమైన ఈ చిత్రం కోసం రెబల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

