Supreme Court: వీధి కుక్కల దాడుల అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడద భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బ తీసిందని వ్యాఖ్యానించింది. సోమవారం ఈ అంశంపై సుంప్రీకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆగస్ట్‌లో ఆదేశాలు
ఆగస్ట్(Augst) నెలలో విచారణ సందర్భంగా వీధి కుక్కలను పట్టుకోవడం, సంతానోత్పత్తి(Fertility)ని నిరోధించడం, శిబిరాలకు తరలించడంపై తీసుకునే చర్యలను తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలని చెప్పింది. ఢిల్లీ(delhi), తెలంగాణ(Telangana), పశ్చిమ బెంగాల్ తప్ప ఇతర రాష్ట్రాలు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు
చలనం లేదా?
‘రాష్ట్రాల నుంచి స్పందన లేదు. వీధి కుక్కల(Dogs) దాడులు పెరుగుతున్నాయి. దీనివల్ల విదేశాల్లో దేశంపై చెడుగా చిత్రీకరిస్తున్నారు. రెండు నెలల సమయం ఇచ్చినా చలనం లేదా?’ అని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ప్రశ్నించింది. అఫిడవిట్లు దాఖలు చేయని రాష్ట్రాల సీఎస్‌లకు సమన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదో వివరణ కూడా ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే సమాధానం ఇచ్చిందని, ప్రభుత్వం నుంచి అఫిడవిట్ రాలేదని మందలించింది.
Also Read: Mahesh Kumar Goud: ఎమ్మెల్యేలకు డీసీసీ ఇచ్చే అవకాశం: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్
