TG SSC 10Th class Results (Image Source: AI)
తెలంగాణ

TG SSC 10Th class Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే పదో తరగతి ఫలితాలు

TG SSC 10Th class Results: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలను బుధవారం (30వ తేదీన) మధ్యాహ్నం ఒంటి గంటకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్​ నాలుగు వరకు పరీక్ష రాశారు. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించనుంది. గతంలో ఉన్న గ్రేడింగ్​ విధానానికి స్వస్తి పలికింది. ఇందులో భాగంగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్​ ఇవ్వనుంది.

Also Read: Bhoodan land Issue: హైదరాబాద్ లో బడా భూముల స్కామ్.. ఐఏఎస్, ఐపీఎస్ లకు నోటీసులు!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఇటీవల మూల్యాంకనం కూడా పూర్తయింది. కాగా గ్రేడింగ్​ విధానంపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం (Telangana govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రేడింగ్​ అవసరం లేదని పాత పద్ధతిలోనే మార్కుల విధానంలో మెమో జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై తుది మార్గదర్శకాలు విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలలో కాస్త జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల కీలక సమీక్ష జరిపిన విద్యాశాఖ (Education dept) మార్కుల విధానంలో మెమో (Memo) జారీకి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సమయమిస్తే ఎప్పుడైనా ఫలితాలు విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా.. 30వ తేదీ ఉదయం ఫలితాలు విడుదల చేయనునుంది.

Also Read This: Jagga Reddy on KCR: కేసీఆర్, రేవంత్ లలో ఎవరు గొప్ప? లాజిక్ గా ఆన్సర్ ఇచ్చిన జగ్గారెడ్డి!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?