South Central Railway: వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైళ్లలో రద్దీ భారీగా కొనసాగింది. పండుగలకు ఊర్లకు ప్రయాణమైన వారంతా నెమ్మదిగా తిరిగి నగరాల వైపునకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రష్ ఎక్కువగా ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మచిలీపట్నం – చార్లపల్లి ప్రత్యేక రైలు
మచిలీపట్నం నుంచి చర్లపల్లి (Machilipatnam To Charlapalli) మధ్య స్పెషల్ ట్రైన్ (నెం. 07642)ను నడుపుతున్నట్లు ఎస్ఈఆర్ (South Central Railway) తెలిపింది. అక్టోబర్ 24 నుంచి 26 తేదీల మధ్య ఇది అందుబాటులో ఉండనుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
చార్లపల్లి – బరౌనీ ప్రత్యేక రైలు
నెం. 07093 కలిగిన ప్రత్యేక రైలు అక్టోబర్ 25న చర్లపల్లి నుండి బరౌనీ (Barauni To Charlapalli) వరకు నడుస్తుంది. అక్టోబర్ 27న బరౌనీ నుంచి రైలు (నెం. 07094) తిరుగు ప్రయాణమవుతుంది. ఈ రైళ్లు జనగామ, ఖాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బాల్‌హర్‌షా, చందా ఫోర్ట్, గొండియా, దుర్గ్, రాయపూర్, బిలాస్ పూర్, ఝార్సుగుడా, రూర్కేలా, రాంచీ, మూరీ, బోకారో స్టీల్ సిటీ, ధన్‌బాద్, చిత్తరంజన్, మధుపూర్, జసిదీహ్ స్టేషన్లలో ఆగుతుంది.
నాందేడ్ – పానీపట్ ప్రత్యేక రైలు
07635 సంఖ్య కలిగిన ప్రత్యేక రైలు.. అక్టోబర్ 30 నుండి నవంబర్ 4 వరకు నాందేడ్ – పానీపట్ మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. పూర్ణ, పరభణి, జల్నా, ఔరంగాబాద్, మన్మాడ్, జల్గావ్, భూసావల్, ఖండ్వా, ఇటన్సీ, రాణి కమలాపతి, బీనా, ఝాన్సీ, ఆగ్రా కేంట్, మధురా, కోసీ కలాన్, న్యూ ఢిల్లీ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
Also Read: Kavith On BRS: బీఆర్ఎస్‌లో ఎంతో కష్టపడ్డా.. రావాల్సిన గుర్తింపు రాలేదు.. జనం బాటలో కవిత ఆవేదన
పలు స్పెషల్ ట్రైన్స్ పొడగింపు..
దసరా, దీపావళి పండుగల సందర్భంగా తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రోజులు పొడిగించింది. బెంగళూరు కంటోన్మెంట్ – కలబురిగి మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను అక్టోబర్ 29వరకూ పొడిగించింది. రైల్వే వర్గాలు ప్రకారం.. కలబురిగి నుంచి యశ్వంత్ పూర్ కు నెం.06204 స్పెషల్ ట్రైన్ అక్టోబర్ 26న అందుబాటులో ఉంటుంది. అలాగే బెంగళూరు కంటోన్మెంట్ – కలబరిగి (నెం.06207) రైలు అక్టోబర్ 27న, కలబురిగి – బెంగళూరు కంటోన్మెంట్ (నెం.06208) అక్టోబర్ 28న, కలబురిగి – బెంగళూరు కంటోన్మెంట్ అక్టోబర్ 29న నడవనుంది.
