Sonia Gandhi: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ(Telangana) ముందుకుసాగనున్నదని ఏఐసీసీ(AICC) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ప్రత్యేకంగా ఆమె అభినందనలు తెలిపారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit) కీలక భూమిక పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుండడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.
Also Read: Cyber Crime: విదేశీ ఉద్యోగాల పేర సైబర్ మొసాలు.. వరంగల్లో 5గురు ఏజెంట్లు అరెస్ట్!
సోనియా గాంధీ లేఖలో..
తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక, ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కాదల్చిన వారికి ఈ సమ్మిట్ ఒక వేదికగా అందిస్తుందని ఆమె తెలిపారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ-వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ(Telanagana) ముందుకు సాగుతోందని సోనియా గాంధీ ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు(Human Resources), సహజ వనరులు(Natural resources), ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ(International talent), సాంకేతిక నైపుణ్యాల(Technical skills) అభివృద్దికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందని ఆమె తెలిపారు. సమ్మిట్‌లో పాల్గొనే వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: DDLJ: ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’కు 30 వసంతాలు.. షారుఖ్, కాజోల్ ఏం చేశారంటే?

