Teacher Misuse: ఓ ప్రభుత్వ గణితం టీచర్‌తో కార్యాలయ పనులు!
Teacher Misuse (imagecredit:swetcha)
Telangana News, కరీంనగర్

Teacher Misuse: ఓ ప్రభుత్వ పాఠశాల విద్యలో విచిత్రం.. గణితం టీచర్‌తో కార్యాలయ పనులు!

Teacher Misuse: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యాన్ని పక్కనబెట్టి, హుజూరాబాద్(Huzurabad) మండల విద్యాధికారి (ఎంఈఓ) తన కార్యాలయ పనుల కోసం ఒక కీలకమైన గణిత ఉపాధ్యాయుడిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మండల విద్యాధికారిపై, అలాగే బోధనేతర విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్(All India Students Block) (ఏఐఎస్‌బీ) డిమాండ్ చేసింది.

బోధన విస్మరించి..

కరీంనగర్(Karinagar) జిల్లా, హుజూరాబాద్ మండలం పరిధిలోని యూపీఎస్ రంగాపూర్ పాఠశాల(UPS Rangapur School)లో స్కూల్ అసిస్టెంట్ (గణితం)గా పనిచేస్తున్న గోపాల్ రెడ్డి(Gopall Reddy) అనే ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాలుగా తరగతి గదికి దూరంగా ఉంటున్నట్లు ఆరోపణ. కీలకమైన గణితం బోధించాల్సిన ఈ ఉపాధ్యాయుడు మండల విద్యాధికారితో కుమ్మక్కై డిప్యుటేషన్(Deputation) పేరుతో మండల విద్యాధికారి కార్యాలయంలోనే కంప్యూటర్ ఆపరేటర్‌(Computer operator)గా విధులు నిర్వహిస్తున్నాడని ఏఐఎస్‌బీ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యులు కొలుగూరి సూర్య కిరణ్(Koluguri Surya Kiran) పాఠశాల కమిషనర్ అండ్ సంచాలకులు (పాఠశాల విద్య, తెలంగాణ)కు రాసిన ఫిర్యాదు లేఖలో స్పష్టం చేశారు.

Also Read: iBomma Ravi: ‘ఐ బొమ్మ’ రవి గురించి ‘అఖండ 2’ నిర్మాతలు ఏం అన్నారంటే?.. ఇది ఊహించి ఉండరు..

విద్యార్థులకు అన్యాయం

పాఠశాలకు వెళ్లకుండా, విద్యార్థులకు పాఠాలు బోధించకుండానే గత రెండు సంవత్సరాలుగా గోపాల్ రెడ్డి పూర్తి జీతం పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవైపు విద్యార్థులకు గణితం బోధించాల్సిన ఉపాధ్యాయుడిని కార్యాలయ అవసరాల కోసం వాడుకోవడం, మరోవైపు ఆ ఉపాధ్యాయుడు బోధనేతర పనులు చేస్తూ జీతం తీసుకోవడం విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల వ్యవస్థకు తీవ్ర అన్యాయం చేసినట్లేనని సూర్య కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం విద్యార్థులకు అత్యంత ఉపయోగపడే గణిత ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పరిమితం చేస్తున్న మండల విద్యాధికారిపై, అలాగే బోధనను విస్మరించి కార్యాలయ పనులు చేస్తున్న గోపాల్ రెడ్డిపై తక్షణమే విచారణ జరిపి, వారిరువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎస్‌బీ తరపున ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read: Realme Watch 5: స్టైలిష్ డిజైన్‌తో రియల్‌మీ వాచ్ 5 లాంచ్.. ఫీచర్లు ఇవే..!

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు