Severe Cold Wave: తెలంగాణ (Telangana) రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ‘కోల్డ్ వేవ్’ ( Severe Cold Wave) గుప్పిట్లో చిక్కుకొని వణికిపోతోంది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రాత్రిపూట సింగిల్ డిజిట్‌కు పడిపోవడం సాధారణంగా మారిపోయింది. దీంతో, ప్రజలు గజగజ వణుకుతున్నారు. గురువారం (డిసెంబర్ 11) రాత్రి హైదరాబాద్ నగరంలో (Hyderabad) ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో నగరవాసులు గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంత చలిని అనుభవిస్తున్నారు. ఇక, రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి ఉత్తర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదవుతున్నాయి. సంగారెడ్డిలోని కోహిర్‌లో, ఆసిఫాబాద్‌లోని గిన్నెధరిలో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ రికార్డ్ కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Read Also- Local Body Elections: గజ్వేల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరనుందా.. ప్రముఖుల గ్రామాల్లో ఉత్కంఠ ఫలితాలు
ఈ తీవ్రత ఎప్పటివరకు?
ఈ తీవ్రస్థాయి కోల్డ్ వేవ్ (COLDWAVE) ఇప్పట్లో తగ్గదని, రాబోయే 8-10 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశమే లేదని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) హెచ్చరించింది. శనివారం నుంచి ప్రస్తుత ఉష్ణోగ్రతలు మరో 1-2 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరపెరిగే సూచనలు ఉన్నప్పటికీ, తీవ్రమైన చలి వాతావరణం మాత్రం కొనసాగుతుందని వివరించింది. మరో అలర్ట్ ఏంటంటే, డిసెంబర్ 18-22 మధ్య తేదీలలో తెలంగాణలో మరో అత్యంత తీవ్రమైన కోల్డ్ వేవ్ (PEAK COLDWAVE) వచ్చే అవకాశం ఉందని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ పేర్కొంది. కాబట్టి, రాత్ సమయం, ఉదయం పూట ప్రయాణాల చేసేవారు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
పలు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ అప్‌డేట్‌లో వాతావరణ శాఖ (IMD) కూడా హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వృద్ధులు, పిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. డిసెంబర్ 16 వరకు చలి తీవ్రత ఇదే విధంగా కొనసాగుతుందని ఐఎండీ అంచనాగా ఉంది.
Read Also- CM Chandrababu: విశాఖలో మరో మైలురాయి.. కాగ్నిజెంట్ ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో ఎముకలు కొరికే చలి
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌పై చలి పంజా విసురుతోంది. నగరవాసులు ఎముకలు కొరికే చలితో గజగజ వణికిపోతున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో గత 7 సంవత్సరాలలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదయ్యాయి. శుక్రవారం (డిసెంబర్ 12) తెల్లవారుజామున యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 6.3 డిగ్రీ సెల్సియస్, మౌలాలిలో 7.1, రాజేంద్ర నగర్‌లో 7.7, అల్వాల్‌లో 9, గచ్చిబౌలిలో 9.1, బొల్లారంలో 9.3లో, మారేడ్‌పల్లిలో 10.1, కుత్బుల్లాపూర్‌లో 10.2, జీడిమెట్లలో 11 డిగ్రీ సెల్సియస్ చొప్పున అత్యుల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

