Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే నాణ్యమైన విత్తనం
Prof Kodandaram (imagecredit:swetcha)
Telangana News

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

Prof Kodandaram: విత్తన ధ్రువీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం(Professor Kodandaram) ఉన్నారు. శనివారం విత్తన దృవీకరణ సంస్థ కేంద్ర కార్యాలయంలో “తెలంగాణ విత్తన ధృవీకరణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం” నిర్వహించరు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. విత్తన హబ్ గా చెప్పుకునే తెలంగాణలో, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో విత్తన ధ్రువీకరణ సంస్థ పాత్ర అత్యంత కీలకం అని, విత్తన దృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం అందుతుంది అని, కల్తీల విషయంలో జవాబుదారీ తనం ఉంటుందని, సంస్థ చిన్నది అయిన, వీరీ యొక్క సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్స్ అవశ్యకత చాలా ముఖ్యమైనదన్నారు.

నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలను..

సంస్థ అభివృద్ది విషయంలో ప్రభుత్వం కూడ ప్రత్యేక దృష్టి సాదించి, విత్తన దృవీకరణ సంస్థకు డెపార్ట్ మెంట్ హోదా కల్పిస్తూ, 010 హెడ్ క్రింద ట్రెజరీ నుంచి నేరుగా ఉద్యోగుల జీతాలు ఇచ్చి, సంస్థను ఆర్థిక సమస్యల నుంచి అదిగమించేలా చేస్తే, విత్తన దృవీకరణ కూడా సమర్థవంతంగా జరిగి, సంస్థ అనుకున్న లక్ష్యాలను సాదించి, రైతులకు నాణ్యమైన సర్టిఫైడ్ విత్తనాలను అందించే అవకాశం ఉందని, త్వరలో వీటిపైన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy కి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Minister Thummala Nageswara Rao) కి లిఖిత పూర్వకంగా విన్నవిస్తామని అన్నారు. డిపార్ట్ మెంటల్ హోదా కల్పించడం వలన రాష్ట్రంలో విత్తనాలకు సంబందించిన అన్నీ కార్యక్రమాలు (విత్తనోత్పత్తి, విత్తన దృవీకరణ, నాణ్యత పరీక్ష మరియు మార్కెటింగ్) ఒకే పరిపాలనలోకి వచ్చి, సమగ్ర పర్యవేక్షణతో రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన దృవీకరణ విత్తనాల సరఫరా సాధ్యమవుతుందని అన్నారు.

Also Read: Fake Journalists: ఫ్లయింగ్ స్క్వాడ్ ముసుగులో బలవంతపు వసూళ్లు.. సిగ్నేచర్ స్టూడియో యాంకర్ అరెస్ట్!

దేశం మొత్తంలో సీడ్ సర్టిఫికేషన్

ఇప్పటికే విత్తన దృవీకరణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో టెక్నికల్ స్టాఫ్ కు జీతాలు ఇస్తుంది కావునా, అదేవిధంగా, విత్తన దృవీకరణ చార్జీల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంస్కరణ వలన ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారంపడే అవకాశం కూడా ఉండదన్నారు., కేంద్ర ప్రభుత్వం తీసుకరానున్న కొత్త సీడ్ బిల్ – 2025 లో విత్తన దృవీకరణ సంస్థకు ప్రత్యేకత ఉందని, రాష్ట్రంలోనే కాకుండా, దేశం మొత్తంలో సీడ్ సర్టిఫికేషన్ ను కంపల్సరీ చేసి, రైతులకు సర్టిఫైడ్ విత్తనాలే సరఫరా చేయాలని, సీడ్ బిల్ రాకముందే ఇదివరకే తమిళనాడు, కేరళ, సిక్కిం, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాలు ఇప్పటికే తమ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీలను వ్యవసాయ శాఖ ప్రత్యక్ష ఆధ్వర్యంలోకి తెచ్చాయన్నారు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో కేవలం సర్టిఫైడ్ వరి విత్తనాలనే రైతులకు అందించాలని మరియు మహారాష్ట్రలో అన్నీ పంటల నోటిఫైడ్ రకాలను తప్పనిసరిగా సర్టిఫికేషన్ చేయించుకోవాలని ఆయా ప్రభుత్వాలు నిబంధనలు తీసుకవచ్చాయని తెలిపారు.

ఉద్యోగుల పెన్షన్ ను..

సర్వసభ్య సమావేశంలో చర్చించి తీర్మానం చేశారు. ఉద్యోగుల పెన్షన్ ను 30 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. విత్తన ధృవీకరణ సంస్థకు ఒక డిపార్ట్ మెంటల్ స్టేటస్ ను కల్పించి వ్యవసాయ శాఖ లో ఒక ప్రత్యేక విభాగం క్రింద చేర్చాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించి వారి జీతాలను పెంచాలని, కాంట్రాక్ట్ ప్రాతిపదిక ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ (FA) ల కు వ్యవసాయ విస్తరణ అధికారి బేసిక్ సాలరీకి సమానంగా, 32,000 లకు పెంచాలని, ఉద్యోగులకు కొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని తీసుకువచ్చి వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని చర్చించారు. సమావేశంలో తెలంగాణ విత్తన ధ్రువీరకరణ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ టి. జయ ప్రకాష్,జనరల్ సెక్రటరీ పెబ్బేటి మహేష్, వైస్ ప్రసిడెంట్ బి. రవి, ట్రెజరర్ వి. పృథ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Lancet Study: ఏజెన్సీ ఏరియా సర్వేలో వెలుగులోకి సంచలనాలు.. ఆశాలు, అంగన్వాడీల పాత్ర కీలకం!

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ బిగ్ అప్డేట్.. సింక్​ అయిన డేటా కోసం ప్రయత్నాలు ముమ్మరం

Akhilesh Yadav: ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తాం: అఖిలేష్ యాదవ్

Messi In Hyderabad: మెస్సీ‌తో ముగిసిన ఫ్రెండ్లీ మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి

Crime News: దారుణం.. ఐదేళ్ల బాలుడిని కొట్టి చంపిన సవతి తండ్రి

Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం