Telugu Academy: గురుకులాలు, తెలుగు అకాడమీ అధికారుల మధ్య వివాదం నెలకొన్నది. విద్యార్ధుల బుక్స్ పంపిణీకి ఆర్డర్లు, పేమెంట్లు ఇచ్చినా.. లేట్ చేస్తున్నారని గురుకుల అధికారులు విమర్శిస్తుండగా, ఆలస్యంగా ఆర్డర్లు ఇస్తే తామేమీ చేయలేమని తెలుగు అకాడమీ(Telugu Academy) ఆఫీసర్లు క్లారిటీ ఇస్తున్నారు. బుక్స్ పంపిణీ అంశంపై ఇరు వర్గాలు సీఎంవో(CMO)లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. సీఎం వో ఉన్నతాధికారులు కూడా ఇరు వర్గాలు ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తున్నారు. సోమవారం ఇదే అంశంపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. గురుకులాలు, తెలుగు అకాడమీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా.. ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్ధులకు బుక్స్ అందలేదు. ఇదే అంశంపై రెండు ప్రభుత్వ సంస్థల అధికారులు వివాదానికి తెరలేపారు.
Also Read; BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!
రూ.7 కోట్లకు పైనే బిల్లులు చెల్లింపు..?
ప్రభుత్వ కాలేజీలు, ఇతర గురుకులాలతో పోల్చితే ఎస్సీ(SC) గురుకులాల్లో బుక్స్ పంపిణీ(Book distribution) సమస్య ఏర్పడింది. ఈ గురుకుల సొసైటీ రెండు అకాడమిక్ ఇయర్స్ కోసం జూలై నెలలోనే ఏకంగా రూ. 7 కోట్లకు పైగా బిల్లులను తెలుగు అకాడమికి చెల్లించింది. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా పంపిణీ చేయలేదని గురుకుల సొసైటీ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం దృష్టికి చేరిన తర్వాత సెప్టెంబరు ఫస్ట్ వీక్ లో సప్లై చేస్తామని హామీ ఇచ్చారనీ , కానీ ఇప్పటి వరకు స్పందన రాలేదని వివరిస్తున్నారు.
దీని వలన దాదాపు 50 వేల మంది విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నట్లు ఎస్సీ గురుకుల ఆఫీసర్లు వెల్లడించారు. వాస్తవానికి విద్యా సంవత్సరం ప్రారంభనికి ముందే అంటే మే నెలలోనే బుక్స్ పంపిణీకి ప్రిపరేషన్ జరగాలి. గురుకులాలు, అకాడమీ మధ్య సరైన సమన్వయం లేక డీలే అయినట్లు స్పష్టమవుతున్నది.
Also Read: Ramchender Rao: ఈ నెల 17న వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ.. ఎక్కడంటే..?