కాతారం, స్వేచ్ఛ: Saraswati Pushkaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో మే 15 నుండి 26 వరకు జరిగే సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎండోమెంట్ కమీషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో కలిసి సంబంధిత అధికారులతో త్రివేణి సంగమ తీరంలోని నూతన జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ నిర్మాణ పనులను పరిశీలించారు. సరస్వతి విగ్రహం ఏర్పాటుకు స్థలం నిర్ణయించడం, విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు రహదారి నిర్మాణం, పురుషులు, మహిళల కోసం శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు.
Also Read: Betting Suicide Cases: ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు.. బలైంది ఎందరో
పిండా ప్రధాన స్థలం, దుస్తులు మార్చుకునే గదులు, షేవర్లు, త్రాగునీటివసతి, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర పనులను పరిశీలించారు.గోదావరి హారతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వేడి దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం గోదావరిలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తిచేయాల్సిన శాశ్వత, తాత్కాలిక పనులకు ముందుగానే షెడ్యూల్ తయారు చేసుకోవాలని, సిబ్బందిని పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.మెయిన్ పుష్కర ఘాట్ వద్దకు వెళ్లి పరిశీలించారు.
Also Read: 10th Hindi Paper Leaked: పదో తరగతి పరీక్షలో సరిదిద్దలేని పొరపాటు.. రేపటి పరీక్షపై ఉత్కంఠ!
అనంతరం భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 100 గదుల భవనాన్ని పరిశీలించి కొంత మిగిలిపోయిన పనులను మే 10 లోపు పూర్తిచేయాలని డెడ్ లైన్ విధించారు. అనంతరం ఆలయ కార్య నిర్వాహణాధికారి కార్యలయంలో హాల్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంలో 12 రోజులపాటు జరిగే సరస్వతీ పుష్కరాలలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను మే10 లోపు పూర్తి చేయాలని ఎండోమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూచించారు.
Also Read: TG Govt: గ్రామాల్లో పరిశ్రమలకు మించిన ఉపాధి.. ఆ రంగం తగ్గేదేలే!
ఈ సరస్వతీ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ సరస్వతీ పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపద్యంలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా సరస్వతీ పుష్కరాల అభివృద్ధి పనుల కోసం 25 కోట్ల నిధులు మంజూరు చేశారని అన్నారు. పుష్కర ఘాట్ నిర్మాణ పనులు,రోడ్డు వెడల్పు,గెస్ట్ రూంస్ ,బాత్రూంస్, షేవర్లు, విద్యూత్,త్రాగునీరు తదితర పనులు మే 10 లోపు పూర్తిచేయాలన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు