10th Hindi Paper Leaked: ప్రస్తుతం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రేపు (మార్చి 22) జరగాల్సిన హింది పరీక్ష ప్రశ్నా పత్రం ముందుగానే బయటకు రావడం సంచలనం రేపుతోంది. మంచిర్యాల జిల్లాకు చెందిన 240 మంది విద్యార్థులకు ఈరోజు తెలుగు బదులుగా హిందీ ప్రశ్న పత్రం ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది.
ఎలా జరిగిందంటే
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల లో గల పరీక్షా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రేపు జరగవలసిన పదవ తరగతి హింది పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ అయింది. దాదాపుగా 45 నిమిషాల తర్వాత తేరుకున్న అధికారులు హింది ప్రశ్న పత్రాలను వెనక్కి తీసుకుని మళ్ళీ తిరిగి తెలుగు ప్రశ్న పత్రాలను ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రేపు జరగాల్సిన హింది ప్రశ్న పత్రం 240 మంది విద్యార్థుల చేతుల్లోకి వెళ్లడంతో రేపు ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
Also Read: AP Heatwave Alert: మండుటెండలతో జర భద్రం.. ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు
విచారణకు ఆదేశం
అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఉదయం ప్రశ్న పత్రాలు తీసుకు రావడంలో పొరపాటు జరిగినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ 45నిమిషాల వరకు అధికారులు తెరుకోలేక పోయారంటే వారి అలసత్వం వారికి ఇచ్చిన శిక్షణ విషయంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అధికారులపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.