Rural Politics: పట్నంపై పల్లె ఫోకస్ పెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరెవరు పట్నాలలో ఉన్నారు.. ఎంత మంది ఉన్నారనేది ఆరా తీయడంతో పాటు వారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎలా రప్పించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫోన్ చేస్తూ పోలింగ్ రోజూ విధిగా గ్రామాలకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఓటర్ లిస్టు ఆధారంగా..
గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. సర్పంచ్ గా పోటీచేస్తున్న అభ్యర్థులతో పాటు వార్డులవారీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఉపాధికోసం ఇతర రాష్ట్రాలకు, హైదరాబాద్(Hyderabd)తో పాటు ఇతర పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో పాటు వారు ఫోన్లు చేయిస్తున్నారు. ఓటర్ లిస్టు ఆధారంగా ఎంతమందిని కలువాలు.. ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారనే వివరాలతో లిస్టులను తయారు చేస్తున్నారు. వారిని కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. ఫోన్ చేసి మరీ తనకు ఈ గుర్తు వచ్చింది.. ఓటు వేయాలి.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్ధిస్తున్నారు. అంతేకాదు వరుసలు సైతం కలిపి తనను గెలిపించాలని.. గెలిపిస్తే ఏం పని కావాలన్నా చేసి పెడతానంటూ హామీలు ఇస్తున్నారు. ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి రప్పించేందుకు కొంతమంది నేతలకు పార్టీలు సైతం బాధ్యతలు అప్పగిస్తున్నాయి. వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే వరకు వారిదే బాధ్యత అని చెబుతున్నట్లు సమాచారం.
Also Read: HMD India Launch: భారత్‌లో లాంచ్ అయిన HMD 101, HMD 100 ఫోన్లు.. ఫీచర్లు ఇవే..
ఫోన్ పే గానీ, గుగుల్ పే..
పదిమంది ఓటర్లు ఉంటే వారికి పోలింగ్ రోజూ వాహనం సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆ వాహనం కాకుంటే.. సొంత వాహనంలో వస్తే చార్జీలు ఇస్తామంటూ ఫోన్ చేసి పేర్కొంటున్నట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటు కీలకం. గతంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన సర్పంచ్ స్థానాలు చాలా ఉండటంతో సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఫోన్ పే గానీ, గుగుల్ పే చేస్తామంటూ ఆఫర్లు సైతం ఇస్తున్నట్లు సమాచారం. అంటే పోటీచేసే వారు ఎన్నికలకు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనేది స్పష్టమవుతోంది.
ఫోన్ చేసి విజ్ఞప్తులు
ఇది ఇలా ఉంటే మనకులానికి ఈసారి పోటీచేసే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా గెలిపించుకుందాం.. లేకుంటే ఎప్పుడు గెలువలేమని.. అందరూ కలిసి రావాలని ఫోన్ చేసి విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని.. పోలింగ్ రోజూ వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. అందరూ సమిష్టిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మరోవైపు విజ్ఞప్తులు చేస్తున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది.
Also Read: SFI Conference: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సెలబస్‌లో పెట్టే కుట్ర: ఎస్ఎఫ్ఐ

