SFI Conference: ఎన్ఈపీతో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చేర్చే కుట్ర
SFI Conference (imagecredit:swetcha)
Telangana News

SFI Conference: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సెలబస్‌లో పెట్టే కుట్ర: ఎస్ఎఫ్ఐ

SFI Conference: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరిట ఆర్ఎస్ఎస్(RSS) భావజాలాన్ని విద్యాసంస్థల్లో జొప్పించే కుట్ర బీజేపీ(BJP) చేస్తోందని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Student Federation of India) SFI నాయకులు తెలిపారు. దేశంలోని యూనివర్సిటీ క్యాంపస్ లలో జాతీయ విద్యావిధానం పేరుతో విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ పూర్వ రాష్ట్ర కార్యదర్శి సాగర్(Sagar) పేర్కొన్నారు. హైదరాబాద్(Hyderabad) లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజేస్ యూనివర్శీటీ(ఇఫ్లూ) 4వ ఎస్ఎఫ్ఐ మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

బీజేపీ అనుబంధ సంఘాల

దేశంలో అన్ని యూనివర్సిటీలు ఒకే గోడుగు కిందకు తెస్తున్నామనే పేరుతో ఎన్ఈపీ అమలు చేస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని యూనివర్సిటీ సిలబస్ లో చేర్చేందుకు ఎల్ ఓసీఎఫ్​ పేరుతో వేద గణితం పేరుతో జొప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజులు పెంచి, విద్యార్థుల హక్కులపై బాహటంగా దాడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు, వారి అనుచరులకు యూనివర్సిటీ పదవులు ఇచ్చి ప్రజాస్వామిక హక్కులపై దాడిచేసేలా ఉసిగొల్పుతున్నారంటూ ఫైరయ్యారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్ధులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: Corruption Case: రంగారెడ్డి జిల్లా ల్యాండ్​ రికార్డుల అధికారి అరెస్ట్.. విస్తుపోయేలా అక్రమాస్తుల చిట్టా!

ర్యాగింగ్ ఘటనలు

అనంతరం ఎస్ఎఫ్ఐ(SFI) రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్ రజనీకాంత్, నాగరాజు మాట్లాడుతూ ఇప్లూలో ప్రజాస్వామిక హక్కులు లేకుండా వీసీ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారని, కనీసం యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యలపై పోరాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని, ర్యాగింగ్(Ragging) ను అరికట్టేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల(Sangareddy Medical College)లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై పోలీసులు దృష్టిపెట్టి సీనియర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు గా ఆదర్శ్, ఆథ్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు.

Also Read: John Wesley: హిల్ట్‌ పాలసీపై అఖిలపక్షం వేయాలి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ!

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు