Indiramma Houses (imagecredit:twitter)
తెలంగాణ

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు విడుదల

Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేశారు. ఇండ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో భాగంగా నవంబర్ 11వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్‌మెంట్ లెవల్ నిర్మాణాలు 4,615, రూఫ్ లెవల్ (గోడలు పూర్తి) అయిన 8,517, శ్లాబ్ వేసిన 5,115 ఇండ్లు ఉన్నాయని వివరించారు.

Also Read: Delhi Blast: ఢిల్లీ పేలుడు న్యూస్ చూసి.. ముగ్గురు కొడుకులకు తండ్రి ఫోన్.. ఆఖరికి ఆయన ఊహించిందే జరిగింది

ఇప్పటి వరకు రూ.2900 కోట్ల చెల్లింపు

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటి వరకు మొత్తం రూ.2900.35 కోట్లను చెల్లించారు. వీటిలో బేస్‌మెంట్ లెవల్ (బిఎల్) దాటిన ఇండ్లకు రూ.1610.79 కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ ఎల్) రూ.716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి ఆర్ సి) అయిన ఇండ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇండ్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో బేస్ మెంట్ (బిఎల్) స్థాయిలో 90,613, గోడల నిర్మాణపు పూర్తి అయిన స్థాయిలో (ఆర్ ఎల్) 41,212 ఇండ్లు, శ్లాబ్ పూర్తి (ఆర్ సీ) అయినవి 37,400 ఇండ్లు ఉన్నాయని వెల్లడించారు.

Also Read: Saree Distribution: మహిళలకు గుడ్ న్యూస్.. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి డేట్ ఫిక్స్..!

Just In

01

BIBINagar Lake: ఆత్మహత్యలకు కేరాఫ్‌గా మారిన ఓ చెరువు.. ఎక్కడో తెలుసా..!

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 2029 నాటికి ప్రతీ ఒక్కరికి సొంతిల్లు!

Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..

MLC Kavitha: జగదీష్ రెడ్డి పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారంటే..?

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్​: రూ.900 కోట్ల భూ వ్యవహారంపై కలెక్టర్ ఫోకస్..!