TG Global Summit: రెండు రోజుల్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
TG Global Summit (imagecredit:swetcha)
Telangana News

TG Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ రెండు రోజుల్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఇదిగో పూర్తివివరాలు

TG Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో రికార్డుస్థాయిలో ఒప్పందాలు జరిగాయి. సమ్మిట్ రెండురోజుల్లో కలిపి మొత్తం రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలు, పరిశ్రమలు ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ. 5, 39, 495 కోట్లు ఎంఓయూలు ద్వారా పెట్టుబడులుగా వచ్చాయి. తొలి రోజు రూ. 2,00,043 కోట్లు రాగా, రెండో రోజు ఇప్పటి వరకు రూ. 2,96,495 కోట్లు పెట్టుబడులుగా వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పరిశ్రమలు, ఐటీ(IT), పవర్(Power), స్పోర్ట్స్(Sports), టూరిజం, ఫారెస్ట్ తదితర రంగాల్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇక విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో పెట్టుబడుల్లో ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఆసక్తి చూపాయి. వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడులను ఆకర్షించారు. ఇవి రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం తో పాటు ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దేందుకూ ఉపయోగపడతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

కీలకమైన కంపెనీలు..పెట్టుబడుల వివరాలు

ఇన్‌ఫ్రాకీ డిసి పార్క్స్ 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టుందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏజీపీ గ్రూప్ మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) టీకాలు, పరిశోధనఅభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లు అవుతుంది. 3 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారంవ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు. వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఫ్రీజ్డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మంది వరకు ఉద్యోగావకాశాలు లబించనున్నాయి. రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే యూనిట్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

Also Read: Rahul Gandhi – RSS: ‘సర్’పై లోక్‌సభలో చర్చ… ఆర్ఎస్ఎస్ టార్గెట్‌గా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభలో దుమారం

మందుల తయారీ యూనిట్లు..

ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది.ఆర్సీ సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3 వేలకి పైగా ఉద్యోగాలు సృష్టించనున్నారు.హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9 వేలకి పైగా ప్రత్యక్షపరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,5003 వేల మందికి ఉపాధి కల్పించనుంది. భారత్ బయోటెక్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆహారపానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా రూ.650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 1,551 మందికి ఉపాధి దొరకనుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్ ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.

పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు

ఫుడ్ లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,000 కోట్లు పెట్టుబడులతో ముందుకొచ్చింది. డ్రీమ్‌వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ రూ.1,000 కోట్లతో నిర్మించనున్నారు. సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు) రూ.800 కోట్లు, కేఈఐ గ్రూప్ (కామినేని గ్రూప్) రూ.200 కోట్లు, పోలిన్ గ్రూప్ (టర్కీ), మల్టీవర్స్ హోటల్స్ రూ.300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్) రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.300 కోట్లు, రిధిరా గ్రూప్ రూ.120 కోట్లు, సలామ్ నమస్తే దోసా హట్ (ఆస్ట్రేలియా), విశాఖ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్ ఐఫా ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి రూ.550600 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది. ఈ కంపెనీల ద్వార ప్రత్యక్షంగా 10 వేల మందికి ఉద్యోగాలు వస్తుండగా, పరోక్షంగా 30 వేల మందికి రానున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా..

టీడబ్ల్యూఐ గ్రూప్ ప్రపంచంలోనే తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోటార్‌బైక్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు. రూ.1,100 కోట్లు పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాల కల్పన అవకాశాలు రానున్నాయి.మహీంద్రా అండ్ మహీంద్ర జహీరాబాద్ యూనిట్ విస్తరణకు నాలుగేళ్లలో రూ.500 కోట్లకు పైగా పెట్టుబడికి ముందుకొచ్చింది.ఇండియా ఎక్స్ ట్రీమ్ అడ్వెంచర్ 20 ఎకరాల్లో ఎక్స్ ట్రీమ్ స్పోర్ట్స్, అడ్వెంచర్, ఈ-స్పోర్ట్స్ అరేనా. మొత్తంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. బయోవరం టిష్యూ ఇంజినీరింగ్, రెజెనరేటివ్ మెడిసిన్, సెల్జీన్ థెరపీకి ప్రత్యేక కేంద్రం రూ. 250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.జ్యూరిక్ ఇన్షూరెన్స్ ఇండియాలో తొలి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. మూడేండ్లలో దశలవారీగా విస్తరించనున్నారు. కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తమ తొలి భారతీయ GCCని హైదరాబాద్‌లో స్థాపించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ను గ్లోబల్ ఇంజినీరింగ్సైబర్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్క్యంగా పేర్కొంది.మాక్సిమస్ (అమెరికా) గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీఆపరేషన్స్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు.

Also Read: Global Summit 2025: తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. రెండో రోజూ పెట్టుబడుల వెల్లువ.. రూ.1,04,350 కోట్ల ఒప్పందాలు

డెస్క్ ఏర్పాటుకు ఎంఓయూ

జీఎంఆర్ స్పోర్ట్స్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేయనున్నారు. అనలాగ్ ఏఐ (అలెక్స్ కిప్‌మాన్) హైదరాబాద్‌లో గ్లోబల్ పరిశోధనప్రోటోటైపింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.ఆల్ట్ మిన్ బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రం ప్రతిపాదించారు. అజయ్ దేవగన్ ఫిల్మ్ స్టూడియోలో స్టూడియోలు, వీఎఫ్ ఎక్స్, వర్క్ షాప్‌లు వంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్‌ను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయనున్నారు. దీంతో యువతకు ఉపాధి అవకావాలు పెరగనున్నాయి. తెలంగాణయూఏఈఆఫ్రికా పెట్టుబడి భాగస్వామ్యాల కోసం చర్చించారు. బహుళరంగ పెట్టుబడి డెస్క్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకునేందుకు పరిశీలించారు.బ్లాక్‌స్టోన్ ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. సత్త్వ గ్రూప్ సమగ్ర పట్టణ అభివృద్ధి, స్టూడెంట్సీనియర్ లివింగ్ ప్రాజెక్టులపై చర్చించారు.బ్రిగేడ్ గ్రూప్ సమగ్ర టౌన్‌షిప్ ప్రతిపాదనపై చర్చ. ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్‌పై ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది.సుమధుర గ్రూప్ కొత్త టౌన్‌షిప్, మధ్యతరగతి నివాస సముదాయాల ప్రతిపాదించారు.విజ్జీ హోల్డింగ్స్ మల్టీఒమిక్స్, డిజిటల్ ట్విన్, ప్రిసిషన్ హెల్త్ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదించారు.

ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు …

ఫీఫా ఏఐఎఫ్ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ టాలెంట్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి అకాడమీ హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్ హాకి హబ్ గా మార్చేందుకు హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫైయర్ 2026 ను 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియా రోయింగ్ ఛాంపియన్‌షిప్ 2026 నిర్వహించనున్నారు.హైదరాబాద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2026 ప్రపంచంలోనే అతిపెద్ద చెస్ ఉత్సవం కానుంది.

Also Read: Hydra Commissioner: సైదాబాద్ ఎర్రకుంటకు పూర్వ వైభవం తీసుకువస్తాం : హైడ్రా కమిషనర్ రంగనాధ్

Just In

01

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా

Harish Rao: ఫుట్‌బాల్ మీద ఉన్న శ్రద్ధ.. స్కూల్ విద్యార్థులపైన లేదా.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

Gurram Papireddy: యువర్ హానర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది.. చూసి నవ్వుకోండి..

Event Organiser Arrest: కోల్‌కత్తాలో గందరగోళం.. మెస్సీకి సారీ చెప్పిన సీఎం.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్