Nayanam Trailer: యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ ఓటీటీలోకి అడుగుపెడుతున్న తొలి తెలుగు వెబ్ సిరీస్ ‘నయనం’ (Nayanam). తాజాగా ఈ సినిమాకు సంబంధించిట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. డిసెంబర్ 19, 2025న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 లో ప్రసారం కానున్న ఈ సిరీస్, ఒక సీట్-ఎడ్జ్ సైకో-థ్రిల్లర్గా రూపొందింది. ట్రైలర్.. వరుణ్ సందేశ్‌ను మునుపెన్నడూ చూడని విభిన్నమైన, డాక్టర్ నయన్ అనే డార్క్ పాత్రలో కనిపించారు. ట్రైలర్ మొత్తం ఒక ఉత్కంఠభరితమైన, మిస్టరీతో కూడిన మూడ్‌ను సెట్ చేసింది. మనుషులలోని నిజ స్వభావానికి, ఏదో సాధించాలనే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను దర్శకురాలు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ ఈ కథ ద్వారా చాలా లోతుగా చూపించారని తెలుస్తోంది. వరుణ్ సందేశ్ నటనలో చూపిన ఇంటెన్సిటీ ఈ పాత్రలోని సైకలాజికల్ డెప్త్‌ను హైలైట్ చేసింది. ఆయనతో పాటు ప్రియాంక జైన్ (మాధవి), రేఖ నిరోషా (కవిత), సీనియర్ నటుడు ఉత్తేజ్ (గౌరీ శంకర్) వంటి నటీనటులు కూడా కథకు తగ్గ కీలక పాత్రల్లో కనిపించారు.
Read also-LIK Release: ప్రదీప్ రంగనాధన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ వాయిదా!.. వచ్చేది ఎప్పుడంటే?
సాంకేతిక నిపుణుల ప్రతిభ
సాంకేతికపరంగా ఈ సిరీస్ అద్భుతంగా ఉందని ట్రైలర్ స్పష్టం చేసింది. షోయెబ్ సిద్ధిఖీ అందించిన విజువల్స్ థ్రిల్లర్ జోనర్‌కు అవసరమైన డార్క్ టోన్ను, గ్రిప్పింగ్ ఫీల్‌ను అందించాయి. ముఖ్యంగా, అజయ్ అరసడ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు వెన్నెముకగా నిలిచింది. ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠను, భయాన్ని పెంచేలా ఆయన సంగీతం పండించింది. కళ్యాణ్ అందించిన స్క్రీన్‌ప్లే, వెంకట కృష్ణ చిక్కాల ఎడిటింగ్ కథనాన్ని వేగంగా, ఆసక్తికరంగా నడిపించడంలో సహాయపడినట్లు తెలుస్తోంది.
Read also-Bigg Boss9 Telugu: అలా చెప్పడంతో ఇమ్మానుయేల్‌పై ఫైర్ అయిన భరణి.. ఈ క్లాష్ ఏంది భయ్యా..
ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో మంచి ప్రయత్నం
రామ్ తల్లూరి, రాజని తల్లూరి (Ram Talluri & Rajani Talluri) లు తమ ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ ఆరు ఎపిసోడ్ల సైకో-థ్రిల్లర్‌ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. థ్రిల్లర్ కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ సిరీస్, వరుణ్ సందేశ్‌కు ఓటీటీలో ఒక కొత్త ఇమేజ్‌ను తెస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. డిసెంబర్ 19, 2025న ZEE5 లో స్ట్రీమింగ్‌కు రానున్న ఈ ‘నయనం’ వెబ్ సిరీస్, నిజం, భ్రమ మనిషిలోని అంతర్గత తపన అనే సున్నితమైన అంశాల మధ్య గీతలను ఎలా చెరిపేసిందో చూడాలంటే ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే.

