Shadnagar Congress: గ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు
Shadnagar Congress (imagecredi:swetcha)
రంగారెడ్డి

Shadnagar Congress: గ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు

షాద్ నగర్ స్వేచ్ఛ: Shadnagar Congress: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ ముఖ్య కూడలిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలని షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాగమణి, గిరిజన నేత రఘు నాయక్ తదితర కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌, పెట్రోలు ధరలను పెంచి భారం మోపడం సరైంది కాదన్నారు. సామాన్య ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఓవైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉంటే మన దగ్గర మాత్రం ధరలు పెంచడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కడ్డివిరచడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.

Also Read: Bird Flu case: బర్డ్ ఫ్లూ కలవరం.. రంగంలోకి పోలీసులు.. కోళ్ల ఫారాల వద్ద పికెటింగ్!

కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి సామాన్య ప్రజలకు ఊరట కల్పించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రఘు నాయక్, అగ్గనూర్ బస్వo, ఇబ్రహీం, గూడ వీరేశం, అమేర్, విజయ్ కుమార్ రెడ్డి, వీరేశం, జృమద్ ఖాన్, అందే మోహన్ ముదిరాజ్, గ్రంథాలయ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి, మరియు వివధ నాయకులు పాల్గోన్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..