M Kodanda Reddy on Seeds [IMAGE CREDIT: SWETCHA REPORTER]
రంగారెడ్డి

M Kodanda Reddy on Seeds: అక్రమాలకు చెక్.. కర్షకులకే విత్తన హక్కు.. రైతు కమీషన్ ఛైర్మన్

M Kodanda Reddy on Seeds: కల్తీ విత్తనాల నిర్మూలన, రైతుకే విత్తన హక్కు అన్న అంశాలకు చట్ట రూపం ఇచ్చి దానిని అమలుపరిచినప్పుడే దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయం  రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సిజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొని ప్రసంగించారు.

20 అంశాలతో ఐదు భాషల్లో డిక్లేరేషన్ ప్రకటించారు. 2004లో ఈ అంశాలన్నిటితో ముసాయిదా తయారు చేశామని ఇప్పుడైనా దానిని ఆమోదింప చేసుకొని అమలుపరిచినట్లయితే రైతులకు మేలు జరుగుతుందని మన విత్తనాలను మనం రక్షించుకోగలుగుతామని ఏం. కోదండ రెడ్డి అన్నారు.

 Also Read: farmers: నష్టపోతున్న రైతన్న .. ఆ కంపెనీ పట్టించుకునేనా?

అలాగే విత్తన సంరక్షణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు ధాన్యాల విత్తనాలను  భద్రపరిచి పంచుకునే విధానం తిరిగి పునర్జీవింప చేసుకోవాలని,  మిశ్రమ పంటలతో ,పంట మార్పిడి విధానాలతో రైతులు వ్యవసాయం చేయాలని, ఇలాంటి అంశాలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి రైతు కమిషన్ను తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

తెలంగాణ ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ మానవ సాంఘిక జీవనానికి విత్తనం మూలాధారమని వ్యవసాయాన్ని, విత్తనాన్ని కనుగొన్న ఆదిమ మానవుడు ఎంతో గొప్ప వాడని  అన్నారు.  గతంలో ఎక్కడా విత్తన షాపులు ఉండేవి కావని రైతే మేలైన విత్తనాలను నిల్వ చేసి, ఇతరులకు పంచి తాను వ్యవసాయం చేసేవాడని అలాంటి విత్తన మేధోసంపత్తిని రైతు కోల్పోయాడని  అంటూ నూనె గింజలు పండించే స్థితిలో ప్రస్తుతం రైతు లేడని, వ్యవసాయాన్ని రైతుల నుంచి దూరం చేశారని, రైతు  బతకలేని స్థితికి చేరుకున్నప్పటికీ పంటలు పండించడమే ధ్యేయంగా జీవిస్తున్నారని ఆ స్థితి మారాలని ఆయన అన్నారు.

 Also Read: Telangana: పులుల కోసం వచ్చిన తిప్పలు.. అధికారుల ప్లాన్ ఏమిటంటే?

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ విత్తనం మూలం ఇదం జగత్ అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి  తీసుకురావాలని అన్నారు. భూమి, నీరు, గాలి,ఆకాశం నిర్లక్ష్యానికి గురవుతోందని రైతులకు చెయ్యెత్తి జై కొట్టినప్పుడే పంచభూతాల పరిరక్షణ జరుగుతుందని, ఆకుపచ్చ విప్లవం రావాలని దానికి  అన్మాస్ పల్లి ఎర్త్  సెంటర్ కేంద్రం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

విత్తనం పంట అనే వాగ్దానాన్ని ఇస్తుంది కనుక దానిని మనము పరిరక్షించుకోవాలని, త్వరలో రైతులు – విత్తనం పై పాటలు రాసి దానిని ఒక సిడి రూపంలోకి తీసుకువచ్చేలా సిజిఆర్ తో కలిసి కృషి చేస్తానని సుద్దాల అశోక్ తేజ చెప్పారు.

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విధాన విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి రచించిన ‘ఆరోగ్యానికి ఆహారం భద్రతకు విత్తనం’ పుస్తకాన్ని నాగిరెడ్డి ఆవిష్కరించగా మొదటి కాపీని సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు.

సిసిఆర్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన  వ్యవసాయ సంస్థల నిపుణులకు సర్టిఫికెట్ అందజేశారు. అదే విదంగా స్థానిక ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విత్తన పండుగ ముగింపు వేడుకల్లో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?