BRS vs Congress: బోనాల చెక్కుల పంపిణీలో బిఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య రసాభాస జరిగింది. అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర ఆలయం వద్ద బోనాల పండుగ సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మల్కాజిగిరి(Malkajgiri) నియోజకవర్గం దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) తో పాటు బీఆర్ఎస్(BRS) నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్(Congress) నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. కుర్చీలపై కూర్చునే క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సముచిత స్థానం ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చోవడంతో గొడవ మొదలైంది.
Also Read: Wife Suicide Attempt: వరంగల్ జిల్లాలో దారుణం.. యువ డాక్టర్ ఆత్మహత్య
ఎమ్మెల్యేపై సైతం వాటర్ బాటిల్
ఇది కాస్త గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మల్కా జిగిరికి చెందిన బీఆర్ఎ ఎస్ మహిళా కార్పొరేటర్ భర్తపై దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేపై సైతం వాటర్ బాటిల్ ను విసిరిరారు. అప్రమత్తమైన గన్ మెన్ వెంటనే దానిని అడ్డుకున్నాడు. ఇంతలో పోలీసులు వచ్చి కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ విషయమై పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని, వీడియోలు కూడా చూస్తున్నామని చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congrees) నాయకులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
Also Read: Tummala Nageswara Rao: సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం.. మంత్రి తుమ్మల