University Recruitment: ఉద్యాన వర్సిటీ ప్రతిష్ట దెబ్బతీస్తే సహించం!
University Recruitment (imagecredit:swetcha)
రంగారెడ్డి

University Recruitment: ఉద్యాన వర్సిటీ ప్రతిష్ట దెబ్బతీస్తే ఉపేక్షించం.. నియామకాలపై కుట్రలెందుకు..?

University Recruitment: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం ఇచ్చిన ఉద్యోగం నోటిఫికేషన్ అడ్డుకోవాలని కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వర్సిటీ నాన్ టీచింగ్ అధ్యక్షులు పోతురాజు యాదయ్య(Pothuraju Yadaiya), కార్యదర్శి చెంచు రామయ్య(Chenchu ​​Ramayya) తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను భంగం కలిగించేందుకు ప్రయత్నించడం తీవ్రంగా ఖండనీయమ‌ని వారు తీవ్రంగా మండిపడ్డారు.

నోటిఫికేషన్ జీర్ణించుకోలేక..

గత 12 సంవత్సరాలుగా ఒక్క నియామకం కూడా జరగని పరిస్థితుల్లో, డాక్టర్ దండ రాజిరెడ్డి(Danda Rajireddy) ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి 79 అసిస్టెంట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్, 44 అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల‌ కోసం అనుమతి తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు. అధ్యాపక పోస్టులను తీసుకువచ్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి బలమైన పునాది వేశారని స్పష్టం చేశారు. అలాంటిది నోటిఫికేషన్ జీర్ణించుకోలేక, స్వార్థ ప్రయోజనాలతో కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ యూనివర్సిటీ గౌరవాన్ని దెబ్బతీయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదనిపేర్కొన్నారు.

Also Read: CM Revanth Reddy: తెలంగాణ మంత్రులకు సీఎం వార్నింగ్.. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కుట్ర..?

యువ శాస్త్రవేత్తల భవిష్యత్తు

పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేయడాన్నే వక్రీకరించి అసత్య ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా వారు తీవ్రంగా మండిపడుతున్నారు. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన సమయంలో యువ శాస్త్రవేత్తల భవిష్యత్తుతో చెలగాటం ఆడేలా కావాలనే తప్పుడు ప్రచారాలు చేయడం మన్నించరాని నేరమని స్పష్టం చేశారు. విద్యార్థుల అకాడమిక్ అభివృద్ధిని అడ్డుకునే ఈ రకమైన నీచ కుట్రలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. లేనిపక్షంలో సంబంధితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నాన్‌టీచింగ్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు. ఈ స‌మావేశంలో బోర్డు సభ్యులు వైస్ ప్రెసిడెంట్ కే.రాజేశ్వరి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ.అపర్ణ, కోశాధికారి ఎస్.రాజు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

Just In

01

Viveka Murder Case: వివేకా కేసులో సంచలనం.. సుప్రీం కోర్టు కీలక ప్రశ్నలు.. దర్యాప్తు ఓ కొలిక్కిరాబోతుందా?

NIMS Hospital: మొండి వ్యాధులకు ఈ చికిత్స సంజీవని హస్పిటల్: మంత్రి దామోదర రాజనర్సింహ

GHMC: పారిశుద్ధ్యంపై మరింత ఫోకస్ పెంచాలి: కమిషనర్ ఆర్.వి. కర్ణన్

Allari Naresh: ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?

NTR – Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న.. ఇంకా ఎంతకాలమీ సాగదీత.. ఈ ప్రశ్నలకు సమాధానాలెక్కడ?