MLA Veerlapalli Shankar: షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమైన నాయకులను కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధిష్టానాన్ని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే శంకర్ వినతి పత్రాన్ని సమర్పించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేని పార్టీగా అందరూ కలిసి ఐకమత్యంగా గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి మెజార్టీ సాధించారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
Also Read: RTC JAC leaders: క్యాబినెట్ లో.. ఆర్టీసీ కార్మిక సమస్యలు చర్చించాలి!
అంకితభావంతో ఉన్న నాయకులు
కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కొత్తూరు మాజీ జెడ్పిటిసి సీనియర్ నేత మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, ఆర్యవైశ్య నాయకులు అగిరు రవి కుమార్ గుప్తాలకు సామాజిక న్యాయం ప్రకారం కార్పొరేషన్ పదవులు కేటాయించాలని మీనాక్షి నటరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తన నియోజకవర్గం నుంచి మరికొందరు అంకితభావంతో ఉన్న నాయకులను వివిధ రాష్ట్ర కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించడం కోసం సదరు నాయకుల పేర్లను పరిశీలించాలని
ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు.
కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టూరి జగదీశ్వర్, జానంపేట నాగమణి, మహమ్మద్ ఇబ్రహీం, రాయికంటికృష్ణా రెడ్డి, జరుపుల నెహ్రూ నాయక్, బాదేపల్లి సిద్ధార్థ ఎస్సీ, జిల్లెళ్ల రాం రెడ్డిల పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభ్యర్థించారు. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. తాము సూచించిన విధంగా అధిష్టానం షాద్ నగర్ నియోజకవర్గ నేతలకు కీలక పదవుల్లో ప్రాధాన్యత కల్పించి సామాజిక న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: RCB Banned from IPL: ప్రాణాలు కంటే సంబురాలే ముఖ్యమా? ఆర్సీబీని బ్యాన్ చేయాలంటున్న నెటిజన్స్