Ranagareddy Crime (magecredit:twitter)
రంగారెడ్డి

Ranagareddy Crime: ఇండ్ల లిస్టులో పేరు లేదని వ్యక్తి సూసైడ్.. ఎక్కడంటే!

Ranagareddy Crime: ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో తెల్లవారుజామున ఉదయం చోటు చేసుకున్నది. మృతుని కుటుంబీకులు, పోలీసుల తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (44) అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి సొంతిల్లు లేకపోవడంతో ఇందిరమ్మ లిస్టులో అతని పేరు సైతం వచ్చింది. కానీ చివరిలో తన పేరు లిస్టులో లేకపోవడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

గ్రామంలో ఇల్లు మంజూరైన వారందరూ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసుకొంటున్నారు. కానీ అశోక్ పేరు లేకపోవడంతో అతను ఆవేద‌న చెందాడు. ఇంట్లో తెల్లవారుజామున ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నా చావుకు కారణం ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేసిన కాంగ్రెస్ నాయకులు అని తన చేతిపై రాసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. మృతునికి భార్యకు, ముగ్గురు ఆడ పిల్లలుకూడా ఉన్నారు.

Also Read: MLA Raja Singh: సొంత పార్టీపైనే రాజాసింగ్.. సంచలన కామెంట్స్!

పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా

చింతపట్ల గ్రామపంచాయతీ కార్యాలయం ముందు అశోక్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు, బీఆర్ఎస్, సీపీఎం తదితర పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. 120 గజాల స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు మృతుని భార్యకు ఫించన్ ఇచ్చేందుకు అధికారులు దర్నాకు దిగారు. దీంతో అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.

Also Read: Corporators: ఆగని కార్పొరేటర్ల ఆగడాలు.. భార్యల పదవులతో రెచ్చిపోతున్న భర్తలు!

 

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?