Chatanpally Railway Stataion: షాద్ నగర్ చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు కల సాకారం కానుంది. నిత్యం రైళ్ల రాకపోకల కారణంగా ప్రతి పది పదిహేను నిమిషాల వ్యవధిలో గేటు పడుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు చవి చూడాల్సి వచ్చేది. గతంలో పలుమార్లు పాలకులు బ్రిడ్జి నిర్మాణానికి ప్రయత్నాలు చేసినా పూర్తి స్థాయిలో ఫలితం లేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో శాసన సభ ఎన్నిక ముందు యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఎన్నికల సమయానికి నిర్మాణ పనులు అక్కడికి అక్కడే నిలిచిపోయాయి. 25 ఏండ్ల కల సాకారం అవుతుంది అని ప్రజలు ఆశించారు కానీ ఆశలు ఆవిరయ్యాయి దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది కాచిగూడ టు షాద్నగర్ మీదుగా సుమారు నిత్యం 60 రైళ్లు రాకపోకలు జరిగేవి ప్యాసింజర్లు గూడ్స్ ప్రత్యేక రైల రాకపోకల కారణంగా చటాన్ పల్లి రైల్వే గేటు వద్ద పది నుంచి 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అత్యవసర సమయాల్లో మరి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేవి.
నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ 184 కోట్ల నిధులు మంజూరు?
చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు మంజూరైనట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడించారు. మొత్తం 184 కోట్ల నిధులతో ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు వివరించారు. వై ఆకారంలో డిజైన్ రూపొందించి నాణ్యతతో కూడిన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ప్రకటనతో చటాన్ పల్లి ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చటాన్ పల్లి రైల్వే గేట్ గుండా బుచ్చిగూడ, వెల్జర్ల, సంగెం, కొత్తపేట్ గ్రామాలతో పాటు బైపాస్, జేపీ దర్గా వంటి ప్రాంతాలకు ప్రధాన రహదారిగా ఉండేది. అత్యవసర సమయాల్లో గేటు పడడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. గత ఎన్నికల సమయంలో హామీ మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బ్రిడ్జ్ నిర్మాణ హామీని సహకారం చేశారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Minister Seethakka On KTR: కవిత చెప్పిన దెయ్యం అతనే.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
మాట ఇచ్చి మడమ తిప్పే తత్వం కాదు.
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పే తత్వం కాంగ్రెస్ పార్టీ రక్తంలో లేదని, హామీ ఇచ్చామంటే నెరవేర్చే వరకు విశ్రమించదని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరోసారి రుజువు చేశారు అని స్థానిక నేతలు కొనియాడు తున్నారు. గత ఎన్నికల సమయంలో చటాన్ పల్లి ప్రాంతవాసులకు రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని హామీ ఇచ్చి, నిధులు సేకరించడం పట్ల ప్రజల్లో మరింత రెట్టింపు విశ్వాసం పెంచింది.
ప్రజాప్రయోజనాలకై పాటుపడే వ్యక్తి వీర్లపల్లి.
ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే వ్యక్తి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెంది తిరుపతిరెడ్డి కొనియాడారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా అనాలోచితంగా నిర్మాణానికి రూపకల్పన చేసి పనులు ప్రారంభించిందని ఆవేదన వ్యక్తం చేశారు . రెండు వైపులా అవకాశం ఉన్నప్పుడు ఒకవైపు మాత్రమే బ్రిడ్జ్ నిర్మాణానికి రూపకల్పన చేయడం విస్మయానికి గురిచేసిందని అన్నారు. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమీప ప్రాంత ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపడుతానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి నేడు సహకారం చేశారని వీర్లపల్లి శంకర్ ని ప్రశంసించారు.
Also Read: CM Revanth Reddy: 2047 నాటికి భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాలి.. సీఎం కీలక వ్యాఖ్యాలు!