Congress party ministers: 42 శాతం రిజర్వేషన్ తో బీసీ(BC)ల అభ్యున్నతికి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాల సంక్షేమానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Rajanarsimha), రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి(Komati Reddy Venkat Reddy) వెంకట్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు(Jupally Krishna Rao) రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల కేంద్రంలో రూ.12.70 కోట్ల రూపాయలతో నిర్మించబోయే 30 పడకల ఆసుపత్రి భవనానికి, మాడ్గుల వద్ద కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు, మాడ్గుల నుంచి దేవరకొండ రోడ్ వరకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ (Double Lane) రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
డబల్ లైన్ రోడ్ పనులు
ఈ సందర్భంగా మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ విగ్రహలకు, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం రాష్ట్ర మంత్రులు ఆయా కార్యక్రమాల్లో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో భాగంగా మాడ్గుల వద్ద కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు, మాడ్గుల నుంచి దేవరకొండ రోడ్డు వరకు డబల్ లైన్ రోడ్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, ఉచిత కరెంటు, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతోందని తెలిపారు.
Also Read: Janasena: జనసేన ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న టీడీపీ నేతలు!
30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు
మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నామని, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు జీరో బిల్లు కరెంటు ఇస్తున్నామన్నారు. బీసీ కులగణన చేపట్టి 42 శాతం చేపట్టడం జరుగుతోందని అన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ జిల్లాలోని మాడ్గుల కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. త్వరలోనే మహిళా సాధికారతను సంపూర్ణంగా తీసుకురావడం జరుగుతోందని, పేదవారికి బాసటగా నిలుస్తూ సంక్షేమానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రులు మాడ్గుల మండలంలోని 220 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి శాసన సభ్యులు కసి రెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వర రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, ఆర్అండ్ బి అధికారులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: MP Raghunandan rao: సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు బహిరంగ లేఖ