Municipal Elections: ముసాయిదాపై పార్టీలు ఆందోళన
–హద్దులు లేని వార్డుల విభజన
–చిన్నబిన్నంగా ఓటర్ల జాబితా
–అభ్యంతరాలను పరిష్కారించాలని పార్టీల నేతలు ఫిర్యాదు
–మున్సిపాలిటీ ఎన్నికలపై అధికారులు కసరత్తు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగిన నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారులు మున్సిపాలిటీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారు. మొదటగా మున్సిపాలిటీలో వార్డులకు అనుగుణంగా ఓటర్ జాబితాను జనవరి 1వ తేదీన విడుదల చేశారు. ఆతర్వాత విడుదల చేసిన ఓటర్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.అయితే మున్సిపాలిటీ కార్యాలయంలోని అధికారులకు పార్టీల ప్రతినిధులు ఓటర్ జాబితాపై ఫిర్యాదులు చేశారు. అందులో ప్రధానంగా హద్దులు లేకుండా, ఒక ఇల్లు ఒకే వార్డులోనే ఉండకుండా ఇష్టానుసారంగా వార్డుల విభజనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తికమక ఓటర్ జాబితా..
మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగినప్పుడు ఓ నిబంధనకు లోబడి ఉంటే ఓటర్ జాబితా గందరగోళంగా ఉండేది కాదనే ప్రచారం సాగుతుంది. ప్రధానంగా రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో ఇబ్రహీంపట్నం, షాద్ననగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, అమన్గల్లు, వికారాబాద్ జిల్లాలో తాండూర్, వికారాబాద్ పట్టణాల్లో వార్డుల విభజనలో శాస్త్రీయత లేదనే మాట అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఎన్నికల కోసం వార్డుల విభజన చేసి చేతులు దులుపుకోవాలనే పద్దతిలోనే అధికారులు వ్యవహారిస్తున్నట్లు వివరించారు. ఉదాహరణకు ఒక వార్డులో మూడు వార్డులకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి. మరోక వార్డుల్లో భార్య ఓటు ఒక వార్డులో, భర్త, పిల్లల ఓట్లు మరో వార్డుల్లో ఉన్నాయి. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం కలిగిన ఒక ఇంటి నెంబర్ పై 30 మందికి పైగా ఓట్లు ఉన్నట్లు జాబితాలో ఉన్నాయి. ఆ ఓట్లు కూడా ప్లాట్ గానీ, ఇల్లుగానీ లేని వ్యక్తుల పేరుతో జాబితాలో ఉండటం దారుణం. ఈవిధంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ఇదే చర్చ సాగుతుంది. ఓటర్ జాబితా సవరణ చేసే వరకు ఊరుకునేది లేదని ఆయా పార్టీల నేతలు బహిరంగంగానే స్పష్టం చేస్తున్నారు.
బరిలో ఉండే అభ్యర్థులకు ఇబ్బందే..
ప్రస్తుతం విడుదల చేసిన ఓటర్ జాబితాతో బరిలో నిలిచే ఓటర్లకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఏ ఇంటి నుంచి ప్రారంభమై ఎవరి ఇంటి వరకు ముగుస్తుందనే విషయాన్ని కనీసం అధికారులైన పట్టించుకోవాలి. కానీ పనిభారంతో క్షుణంగా చూడకపోవడంతోనే ఓటర్ జాబితాలో తప్పుల తడకగా జరిగిందిని సమాచారం. దీంతో బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారానికి తిరిగేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఎందుకంటే ఒకవార్డుల్లో కనీసం వెయ్యి ఓట్లకు పైగా ఉంటాయి. ఆ ఓటర్లను అందరూ కలువాలంటే ఊరు మొత్తం తిరగాల్సిన పరిస్థితి బరిలో ఉండే అభ్యర్థులకు వస్తుంది. ఒక వార్డు ప్రామాణికంగా ఉంటే భవిష్యత్తులో గెలిచిన అభ్యర్థుల కూడా అదే స్థాయిలో అభివృద్ది కోసం పనిచేయడం జరుగుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు వార్డుల విభజన జరిగినట్లు తెలుస్తోంది. పార్టీల నాయకులు మున్సిపాలిటీ అధికారులకు ఓటర్ జాబితా సవరణ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని పరోక్షంగా హెచ్చారించారు.
Also Read: Lenin Movie: అరె విన్నావా విన్నావా.. ‘లెనిన్’ పాట వచ్చిందిన్నావా.. వ్వా వవ్వారె వారెవా!

