Crowd at Ration Shops( Image credit: swetcha reporter)
తెలంగాణ

Crowd at Ration Shops: మూడు నెలల బియ్యానికి.. ముప్పు తిప్పలు!

Crowd at Ration Shops: రంగారెడ్డి జిల్లాలో మూడు నెలల ఉచిత బియ్యం పొందేందుకు కార్డుదారులు ముప్పు తిప్పలు పడాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోగా..అమలు తీరు మాత్రం లోపభూయిష్టంగా ఉంటోంది. అలా వచ్చాయో! లేదో ఇలా..సన్న బియ్యం అయిపోయాయి. చేసేదేమీ లేక డీలర్లు దుకాణాలను మూసి వేస్తున్నారు. బియ్యం కోసం వచ్చిన కార్డుదారులు దుకాణాలు మూసి ఉండడంతో ఊసూరుమంటూ వెళ్లిపోతున్నారు.

ఎన్నో అవాంతరాలు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా రేషన్‌ సరుకులను ఒకేసారి ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్‌ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీని చేపట్టడంతో ఇది విశేష ప్రజాదరణను చూరగొన్నది. ఇక ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో నిన్నమొన్నటి వరకు రేషన్‌ దుకాణం ముఖం చూడని వారు కూడా క్యూలో నిలబడి సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు.

సన్న బియ్యానికి మరింత  డిమాండ్‌ 

రంగారెడ్డి జిల్లాలో ఆహార భద్రతా కార్డులు 5.58లక్షల వరకు ఉండగా..ఆయా కార్డులకు ప్రతి నెలా 11వేల మెట్రిక్‌ టన్నులకు పైగా బియ్యాన్ని జిల్లాలోని 936 రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. పోర్టబిలిటీ ఆప్షన్‌తో ఎక్కడి నుంచి అయినా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండడంతో సన్న బియ్యానికి డిమాండ్‌ మరింతగా పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారే ఎక్కువగా ఉంటారు.

Also Read: Hydraa: నాలా ఆక్రమణల పై.. హైడ్రా యాక్షన్ షురూ!

ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి అరకొర కేటాయింపులు

వారంతా ఊర్లో బియ్యం తీసుకోకుండా రంగారెడ్డి జిల్లాలోని పలు రేషన్‌ దుకాణాల నుంచే బియ్యాన్ని తీసుకుంటున్నారు. దీంతో రేషన్‌ దుకాణాలకు వచ్చిన బియ్యం వచ్చినట్లే వచ్చి అయిపోతున్నాయి. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటున్నట్లు తెలుస్తోంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి అరకొర కేటాయింపులు జరపడం వల్ల పూర్తిస్థాయిలో మూవ్‌మెంట్‌ కానందునే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రేషన్‌ దుకాణాల్లో బియ్యం నిల్వలు లేకపోవడంతో లబ్దిదారులకు సమాధానం చెప్పలేక షాపులను మూసి ఉంచాల్సి వస్తోందని రేషన్‌ డీలర్లు చెబుతున్నారు.

కార్డుదారులు ఆగ్రహం

ఎంతో ఆశగా రేషన్‌ దుకాణాలకు వెళ్తున్న కార్డుదారులకు..బియ్యం అయిపోయాయన్న సమాధానం వస్తుండడంతో కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో బియ్యం కొరత విషయాన్ని ‘స్వేచ్చ’ ప్రతినిధి అధికారులు దృష్టికి తీసుకెళ్లగా..అక్కడక్కడా స్టాక్‌ లేని విషయం తన దృష్టికి వచ్చినట్లు సివిల్‌ సప్లయ్‌ డిఎం గోపీ కృష్ణ తెలిపారు. స్టాక్‌ అయిపోగానే..ఆయా దుకాణాలకు బియ్యం అందిస్తున్నామన్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి

జిల్లాలోని 935 రేషన్‌ దుకాణాలకు ఇప్పటివరకు 34వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసినట్లు చెప్పారు. అక్కడక్కడా సర్వర్‌ సమస్య నెలకొనడంతోపాటు ఒక్కొక్క కార్డుదారుడు ఆరు మార్లు వేలి ముద్రలు వేయాల్సి రావడంతో 15 నిమిషాల సమయం తీసుకుంటోంది. దీనికితోడు బియ్యం లేక అక్కడక్కడా దుకాణాలు మూసి ఉంటున్నాయి. ఇప్పటికైనా బియ్యం పంపిణీలో అవాంతరాలు నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also  Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!