BJP Laxman
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

MP K Laxman: రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శల దాడి

MP K Laxman: సమాజాన్ని చీల్చేందుకు రాహుల్ ప్రయత్నాలు

కాంగ్రెస్‌కు ఎలాంటి ఎజెండా లేదు
బీజేపీని బూచీగా చూపించి కాంగ్రెస్ పబ్బం గడుపుతోంది
బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటూ సీఎం మీనమేషాలు
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శల దాడి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సమాజాన్ని చీల్చేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (MP K Laxman) ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఐటీ, సోషల్ మీడియా వర్క్‌షాప్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఎలాంటి అజెండా లేకుండాపోయిందని, అందుకే బీజేపీని బూచీగా చూపించి పబ్బం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు.

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే దానికి కారణం మోదీ చేపట్టిన అభివృద్ధేనని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. అగ్రవర్ణాలు, అర్బన్ పార్టీ అనే స్థాయి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చే స్థాయికి బీజేపీ ఎదిగిందని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలను ఢిల్లీకి కనెక్ట్ చేసేలా విమానాశ్రయాలు, రైల్వే లైన్లను నిర్మించినట్లు ప్రస్తావించారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి బీసీలను కాంగ్రెస్ పార్టీ మభ్య పెట్టిందని విమర్శల దాడి చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు.

Read Also- Crime News: లవ్ మ్యారేజ్ చేసుకొని.. భార్యను చంపేశాడు

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు డిసైడ్ అయ్యారని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంవ్యాప్తంగా 16 వేల మండలాలు, మెజారీటీ రాష్ట్రాల అధ్యక్షులను నియమించుకున్నామని తెలిపారు. త్వరలోనే జాతీయ నూతన అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందని లక్ష్మణ్ తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లో సోషల్ మీడియా వారియర్స్ ఉండాలన్నారు. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిందని, అలాంటిది టారిఫ్‌ల పేరుతో ప్రపంచ దేశాలను అమెరికా భయపెట్టాలని చూస్తోందని, ప్రధాని మోదీ ఈ విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నారని ఆయన మెచ్చుకున్నారు.

Read Also- Blue Mushrooms: అడవిలో నీలి పుట్టగొడుగులు.. అటవీశాఖ కీలక సూచన

ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషిచేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. డిజిటల్ అంబాసిడర్‌గా సోషల్ మీడియా వారియర్స్ మారాలని సూచించారు. సొషల్ మీడియాతో వ్యక్తిగత ఎదుగుదలకు పాకులాడకుండా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓబీసీని బీజేపీ బరిలోకి దింపిందని, రోజూ ఓబీసీల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డికి ఒక్క ఓబీసీ నేత కనిపించలేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓబీసీ లను అవమానించారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాస్తవాలు ప్రజల ఎదుట సోషల్ మీడియా వారియర్స్ ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని, ఇందుకు సోషల్ మీడియా కూడా తనవంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పునాది రాయిగా సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలని తెలిపారు. సెన్సేషన్ కోసం, వ్యక్తి గత ఎజెండా కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలని లక్ష్మణ్ స్పష్టంచేశారు.

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!