Mobile Phone Addiction: మీరు సెల్ ఫోన్ చూడకుండా ఉండగలరా.. సెల్ ఫోన్ మొత్తానికే వాడకుండ ఉండగలరా.. మీతో ఎవరు లేకుండా, పోనీ సెల్ ఫోన్ కూడా లేకుండా కొంత సూదూర ప్రయాణం చేయగలరా.. అంటే కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకంటే నేటి సమాజంలో సెల్ ఫోన్ లేకుండా ఉండటం కష్టమే అంటారు అందరూ.. సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన కంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. కానీ ఐనా మనం ఉండలేం. పనిచేయాలన్నా, ఆర్ధికలావాదేవీలు చేయాలన్నా.. మనకు కావాల్సిన వస్థువులను ఆర్డర్ చేయాలన్నా, మన అవసరాలను తీర్చడానికి సైతం మనం నిత్యజీవితంలో సెల్ ఫోన్ చాలా ప్రాముఖ్యమైందిగా మనం ఉపయోగిస్తుంటాము. అయితే పంజాబ్‌లోని మోగా జిల్లా గోలియా ఖుర్ద్ గ్రామస్థులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఫోన్ వాడకుండా ఎవరు ఎక్కువ సమయం ఉండగలరో వారే విజేతలు అయ్యేలా ఓ పోటీ నిర్వహించారు.
ఎవరైతే ఎక్కువ సమయం..
పంజాబ్(Punjab)లోని మోగా జిల్లా గోలియా ఖుర్ద్ గ్రామస్థులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. సెల్ ఫోన్(Cell Phone) వాడకుండా ఎవరు ఎక్కువ సమయం ఉండగలరో వారే విజేతలగా నిలిచేందుకు ఓ పోటీని నిర్వహించారు. ఇలా వారు చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఫోన్‌లకు దూరంగా ఉండమని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రత్యేకమైన పోటీని ప్రారంభించినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. ఎవరైతే ఎక్కువ సమయం ఫోన్(Cell Phone) వాడకుండా ఉంటారో వారిని విజేతలు ప్రకటిస్తామని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఫోన్ వాడకం తగ్గించడంలో కొంత మేరకు ప్రయత్నం చేసిన వాల్లముగా ఉంటామని వారు తెలిపారు. ఎప్పుడు ఉరుకులు పరుగులుగా ఉండే మన నిత్యజీవితంలో సెల్ ఫోన్ వాడకం తగ్గిస్తే ఎంత మేరకు మనకు లాభాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఇదో చిన్న ప్రయత్నంగా అక్కడి గ్రామస్తులు తెలిపారు.
ఫోన్ చూడకపోతే ప్రైజ్..!
పంజాబ్‌లోని మోగా జిల్లా గోలియా ఖుర్ద్ గ్రామస్థుల వినూత్న ప్రయత్నం
ఫోన్ వాడకుండా ఎవరు ఎక్కువ సమయం ఉండగలరో వారే విజేతలు
ఫోన్‌లకు దూరంగా ఉండమని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రత్యేకమైన పోటీని ప్రారంభించినట్లు చెబుతున్న నిర్వాహకులు pic.twitter.com/qfVVK5npBu
— BIG TV Breaking News (@bigtvtelugu) December 1, 2025
Also Read: BL Santhosh: అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు.. పార్టీ నాయకులకు బీఎల్ సంతోష్ దిశానిర్దేశం!
