Christina Zed (imagecredit:swetcha)
తెలంగాణ

Christina Zed: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో వరుస బదిలీలు..!

Christina Zed: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) కార్యాలయం వరుసగా అవినీతి ఆరోపణలు, లైంగిక వేధింపుల ఫిర్యాదులతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. గురువారం స్వయంగా ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్(Christina Zed). చొంగ్తూ కోఠిలోని ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించి, కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమాచారం ప్రకారం, అన్ని విభాగాల పరిస్థితిపై ఆరా తీసిన కార్యదర్శి, ముఖ్యంగా డీహెచ్ కార్యాలయంపై వస్తున్న ఫిర్యాదులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఉద్యోగులకు సెక్షన్లు మార్చాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కార్యదర్శి ఆదేశాల మేరకు, అడ్మినిస్ట్రేషన్ సెక్షన్‌లోని కీలక విభాగాల్లోని ఐదుగురు ఉద్యోగుల సెక్షన్లను మారుస్తూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన డీహెచ్, తప్పిదాలు, నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలపై మండిపడ్డారు.

ట్రాన్స్‌ఫర్ల నుంచి లీగల్ నోటీసు వరకు..

డీహెచ్ కార్యాలయంలో ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం నుంచి తాజాగా మహిళా ఉద్యోగి లీగల్ నోటీసుల అంశం వరకు అన్నీ హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో జనరల్ ట్రాన్స్‌ఫర్ల విషయంలో కొందరు కీలక ఉద్యోగులు భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విజిలెన్స్, ఏసీబీ(ACB) విచారణలోనూ తప్పిదాలు తేలినా, కేవలం మొక్కుబడిగా మెమోలు ఇచ్చి సరిపెట్టారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా వచ్చిన మహిళా వేధింపుల ఆరోపణలపై కూడా మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారని, సదరు ఉద్యోగి సెక్షన్ మార్చి డీహెచ్ సైలెంట్‌గా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతర్గత విచారణకు ఆదేశించినా, అదే కార్యాలయం సిబ్బందికి బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పారదర్శకంగా విచారణ జరగాలంటే, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఇతర హెచ్‌ఓడీల ఉద్యోగులు లేదా సెక్రటేరియట్ అధికారులతో విచారణ చేయించాలని సిబ్బంది కోరుతున్నారు.

Also Read; Naga Chaitanya: శోభిత‌నే నా బ‌లం.. నా లైఫ్‌లో ఎక్కువ‌ ఇంపార్టెన్స్ ఆమెకే!

అతి తక్కువ కాలంలో..

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆ సీటులో కూర్చున్న తర్వాత అతి తక్కువ కాలంలోనే అత్యధిక ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిగా గుర్తింపు పొందారు. డిప్యుటేషన్లు, పోస్టింగ్‌లు మార్పిడి, సరెండర్ అయిన ఉద్యోగులకు అనుకూలమైన చోట పోస్టింగ్‌లు ఇచ్చే అంశాల్లో భారీగా డబ్బు చేతులు మారాయనే ఆరోపణలు కార్యాలయంపై బలంగా ఉన్నాయి. గతంలో ఒక నర్సింగ్ ఆఫీసర్ ఆడియో టేపు కూడా కలకలం సృష్టించింది. ఏసీబీ(ACB) విచారణలో నిజమేనని తేలినా, ఉన్నతాధికారులు కేవలం నామమాత్రపు చర్యలే తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు ఉద్యోగుల తప్పుల వల్ల కార్యాలయానికి మొత్తం చెడ్డ పేరు వస్తుందని నిజాయితీగా పనిచేస్తున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

Also Read:Sleep Benefits: ఎక్కువసేపు నిద్ర పోతున్నారా.. అయితే, జరిగేది ఇదే..!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!