Future City: –అభివృద్ధి కోసమే భూ సేకరణ చేపడుతున్నాము
–మూసీ నది ప్రక్షాళనతో పునర్జీవం
–అర్హులైన పేదలకు ప్రభుత్వం సంక్షేమం
–కబ్జా భూములను కాపాడుతున్నాము
–గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించిన నివేధిక
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ అనేది భారతదేశంలో మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ఫిల్డ్ స్మార్ట్ సిటీ అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సీఎం మానస పుత్రిక ప్రాజెక్టు అని తెలిపారు. అద్భుత వారసత్వ సంపద, సుస్థిరమైన పట్టణాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు ఒక నమూనాగా రంగారెడ్డి జిల్లా రూపుదిద్దుకుంటుందని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేల మధ్య కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీలకు ధీటుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మాసిటీలతో పాటు లైఫ్ సైన్స్సెస్ హెల్త్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో జరిగిన అభివృద్ధి నివేధికను కలెక్టర్ చదివి వినిపించారు… రంగారెడ్డి జిల్లా రూరల్ ప్రాంతంలోని ప్రజలకు పూర్తి రక్షణ ఉండేందుకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమీషనరేట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.భవిష్యత్తులో ఫోర్త్ సిటీ కూడా శాంతియూత వాతావరణంలో ఉండేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రోల్ మోడల్ పట్టణంగా రూపోందించేందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఫ్యూచర్ సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీ..
హైదరాబాద్ నగర కేంద్రం నుండి వివిధ జిల్లాలను కలుపుతూ, పారిశ్రామిక, ఐటీ, లాజిస్టిక్స్ హబ్‌లకు వేగవంతమైన రోడ్డు కనెక్టివిటీకి ప్రాధాన్యతను ఇస్తూ రేడియల్ రోడ్లను నిర్మిచడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిచడం జరిగిందన్నారు. ఈ రేడియల్ రోడ్లను ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు లను అనుసంధానిస్తూ నిర్మించడం జరుగుతుందని వివరించారు. అందులో భాగంగా మన జిల్లాలో మొట్ట మొదటిగా 300 అడుగుల వెడల్పుతో రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రావిర్యాల ఓఆర్ఆర్ ఇంటర్ ఛేంజ్ నుండి ఆమనల్ మండలం ఆకుతోటపల్లి గ్రామం మధ్య 41.5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు హైదరాబాద్ మహానగరంతో పాటు ఫ్యూచర్ సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని అన్నారు. అదేవిధంగా మరో రేడియల్ రోడ్డు బుద్వేల్ నుండి నాచారం వరకు భూసేకరణకు నోటిఫికేషన్ జారి చేశామన్నారు. ఈ రేడియల్ రోడ్డు వలన బుద్వేల్ నుండి నాచారం మధ్య గల షాబాద్, కొందుర్గ్, చౌదరిగూడెం వంటి మండలాలు వేగంగా అభివృద్ధి చెందగలవని అన్నారు. మూసీ నది ప్రక్షాళనతో పునరుజ్జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేసి రెండు దశల్లో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు.
Also Read: Republic Day 2026:: మేడ్చల్ పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..
మొదటి దశలో హిమాయత్ సాగర్ బాపు ఘాట్ వరకు గల ఈసానది, ఉస్మాన్ సాగర్ నుండి భాపు ఘాట్ వరకు గల మూసి నది సుందరీకరణ జరగనున్నట్లు తెలిపారు. ఈ పనులు తొందరలోనే ప్రారంభం కానున్నాయని వివరించారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం, బోటింగ్ ల ఏర్పాట్లు, సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చేప్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను ఫ్యూచర్ సిటీ లో గత డిసెంబర్ 8, 9 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అభివృద్ధి చేయడం కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతుందన్నారు. తెలంగాణను ప్రపంచంలోని విఖ్యాత కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడే తయారు చేసేలా, రాష్ట్రాన్ని ‘చైనా ప్లస్’ స్థానంలో నిలపడానికి దిశానిర్దేశం చేయడమే ఈ రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశ్యమన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటకం వంటి కీలక రంగాల్లో సుమారు రూ.5లక్షల 75 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని వివరించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ లోనే సీఎంచే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించడం మన అందరికి గర్వకారణమన్నారు.
సంక్షేమంలో ముందడుగులో ఉన్నాము
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు అందించే సంక్షేమ పథకాల పంపిణిలో జిల్లా ముందడుగులో ఉందన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాటికి ఇందిరమ్మ పేరుతో ఇండ్లు మంజూరు చేశాము. రేషన్ కార్డులేని ప్రతి పేదవాడికి కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మి, గృహజ్యోతి, వ్యవసాయంలోని రైతు భరోసా, బీమా, ఉద్యానవనం, పట్టుపరిశ్రమ, అయిల్ ఫామ్ సాగు, సన్నబియ్యం పంపిణి, వనమహోత్సవం, విద్యా, వైద్యారోగ్యం, చేయూత పెన్షన్లు, ఉపాది హామీ పథకం, మహిళాలకు వడ్డి లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి , మహిళా శిశు సంక్షేమం, షెడ్యూల్ కులాల సంక్షేమం, కళ్యాణ లక్ష్మి షాదిముబారక్, ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాల్లో పురోగతిని జిల్లా కలెక్టర్ వివరించారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా నిలుస్తోందన్నారు. హైదరాబాద్‌కు ఆనుకుని ఉండటం, మెరుగైన మౌళిక సదుపాయాలు, నైపుణ్యం గల మానవ వనరులు లభ్యత వల్ల మన జిల్లా పరిశ్రమలకు అత్యంత అనుకూలంగా ఉందన్నారు. పరిశ్రమల ఖిల్లాగా పేరొందిన రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరసలో ఉందన్నారు. 2024-25 జిడిపిప్రొవిజినల్ ఎస్టిమేట్స్ ప్రకారం మన జిల్లా రూ.10 లక్షల 32 వేల తలసరి ఆదాయంతో రాష్ట్రంతో పాటు దేశంలోనే జిడిపిలో ఫార్మా, ఐ.టి., టూరిజం మరియు ఇతర సేవా రంగాలలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కలెక్టర్ ప్రసంం అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గ్రామీణాభివృద్ది, వ్యవసాయ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, హౌసింగ్, అగ్నిమాపక, సివిల్ సప్లయ్ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శించారు. గ్రామీణాభివృద్ది, వ్యవసాయ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, హౌసింగ్, అగ్నిమాపక, సివిల్ సప్లయ్, మత్స శాఖ, అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించిన స్టాల్స్ సందర్శించారు. స్కూల్ విద్యార్ధులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సందర్శకులను ఆకర్షించారు.
Also Read: Republic Day 2026: అబ్బురపరిచిన ఏపీ శకటాలు.. అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు!

