Anti-drug Awareness (imagecredit:swetcha)
తెలంగాణ

Anti-drug Awareness: క్షణకాలం సంతోషం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

Anti-drug Awareness: డ్రగ్స్ క్షణకాలం సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ జీవిత కాలాన్ని నాశనం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) అన్నారు. సిద్దిపేట(Sidhipeta) జిల్లా హుస్నాబాద్(Husnabadh) పట్టణంలో యాంటి డ్రగ్స్ పై యువతకు అవగాహన ర్యాలీలో సిపి అనురాధ(Cp Anuradah), అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, డ్రగ్స్ రహిత జీవన శైలికి దూరంగా ఉంటామని విద్యార్థులతో, యువతతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన పక్కన ఎవరైనా మాదక ద్రవ్యాలు వినియోగిస్తే 1908 కి సమాచారం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం

మత్తుకు దూరం ఉండాలని నాషాయుక్త్ భారత్ అభియాన్(Nasha Mukt Bharat Abhiyan) కింద దేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడాలంటే పాశ్చాత్య దేశాలను పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతానికి రాకుండా చూడాలన్నారు. పాశ్చాత్య సంస్కృతి మాదక ద్రవ్యాలను మనం నిర్మూలించాలని కోరారు. సంతోషం కోసం, స్నేహితుల కోరిక మేరకు తాత్కాలికంగా మత్తుసేవిస్తే జీవితాలు నాశనం అవుతాయన్నారు. తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకర ప్రారంభం అవుతుందని, డ్రగ్స్ వద్దు – జీవితం ముద్దు అనే నినాదంతో ముందుకు పోవాలన్నారు.

Also Read: Jagga Reddy: కేసీఆర్ ఫ్యామిలీ దొంగల ముఠా.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి(Linga Murthy), సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య(Bolishetti shivaiah), మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి(Thirupathi Reddy), హుస్నాబాద్ ఆర్ డి ఓ వి. రామ్మూర్తి, ఏసీపీ ఎస్. సదానందం, ఎంఈఓ బండారి మనీలా, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, ఎమ్మార్వో, ఎండిఓ, పలు విభాగాల ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు , ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల బృందం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: CMRF Fund Scam: సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన బాగోతం

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?