Ponguleti Srinivasa Reddy: కర్ణాటక తరహాలో సర్వేయర్లు..
Ponguleti Srinivasa Reddy(image credit:X)
Telangana News

Ponguleti Srinivasa Reddy: రైతులకు గుడ్‌న్యూస్.. కర్ణాటక తరహాలో సర్వేయర్లు..

Ponguleti Srinivasa Reddy: రైతుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేలా భూ లావాదేవీల‌ను స‌మ‌ర్ద‌వంతంగా పార‌దర్శ‌కంగా నిర్వ‌హించ‌డానికి ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క రాష్ట్రంలో విజ‌య‌వంతమైన లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ విధానాన్ని రాష్ట్రంలో అమ‌లు చేయ‌డానికి ప్ర‌త్యేక కార్యాచర‌ణ‌ను రూపొందిస్తున్నామ‌న్నారు.

ఇందులో భాగంగా ఐదు వేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను తీసుకోబోతున్నామ‌ని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ స‌ర్వే శిక్ష‌ణా అకాడ‌మీలో శిక్ష‌ణ ఇస్తామ‌ని అన్నారు.

Also read: Minister Rajnath Singh: పాక్‌కు రక్షణ మంత్రి మాస్ వార్నింగ్.. గూస్ బంప్స్ రావాల్సిందే!

క‌ర్ణాట‌క రాష్ట్రంలో అమ‌లు అవుతున్న లైసెన్స్‌డ్ స‌ర్వే విధానంపై ఇటీవ‌ల స‌ర్వే విభాగానికి సంబంధించిన ఇద్ద‌రు ఉన్న‌తాధికారులు అధ్య‌య‌నం చేసి నివేదిక ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, ఆ నివేదిక ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రప్రభుత్వం లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ పథకం 1999 లో కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ చట్టంలో చేసిన సవరణలతో ప్రారంభమై, 2005-06 నుంచి అమలులోకి వచ్చింద‌న్నారు. ఈపథకం ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు మ్యూటేషన్ స్కెచ్‌ (PMS) తయారుచేయబడుతుంద‌ని, ప్రీ-రిజిస్ట్రేషన్ స్కెచ్‌తో కొనుగోలు చేయబోయే భూమి గురించి విస్తీర్ణం, టైటిల్ వంటి స్పష్టమైన భూసరిహద్దు వివరాలు ఉంటాయ‌న్నారు.

Also read: Boycott Delhi Capitals: ఐపీఎల్‌ను తాకిన బాయ్ కాట్ సెగ.. ఆ జట్టును నిషేధించాలని డిమాండ్!

ప్రస్తుతం క‌ర్ణాట‌క రాష్ట్రంలో 6000 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లు ,4000 మంది ప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నార‌న్నారు. ఒక్కో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ కు నెలకు సగటున 23 దరఖాస్తులు వస్తాయ‌ని దీని ద్వారా అత‌నికి నెల‌కు రూ.25 వేల నుండి రూ. 30 వేల ఆదాయం వ‌స్తుంద‌ని తెలిపారు. లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లు నిర్వహించి, రిజిస్ట్రేషన్ కు ముందు స్కెచ్ త‌యారుచేసి పోర్టల్లో అప్ లోడ్ చేస్తారన్నారు. వీరిపనులను ప్రభుత్వసర్వేయర్లు పరిశీలించి, సంబంధిత అధికారి ఆమోదిస్తారన్నారు.

 

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..