Rangareddy: పుట్టిన రోజు పెళ్లి రోజుల పేరుతో నగర శివారులో యువత జోరుగా జల్సాలు చేసుకుంటున్నారు. ఈ జల్సాలకు మోయినాబాద్ మండలం అడ్డగా మారిపోయింది. గత మూడు నెలలో మద్యం, మత్తు సేవిస్తూ యువతి యువకులు పోలీసులకు పట్టుబడిన సంఘటనలున్నాయి. అయినప్పటికి యువతి, యువకులు జల్సాలు తగ్గించుకునేందుకు ఇష్టపడటం లేదు.
ఆ జల్సాలు కొనసాగించేందుకు ఎంత దూరమైన యువకులు ఆరాటపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్ధాలను నిర్మూలించాలని కంకణం కట్టుకొని పనిచేస్తుంది. అయినప్పటికి యువతలో మార్పు కనిపించడం లేదు. ఏలాగైన మత్తుతో ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో అక్రమ పద్దతికి మార్గాలను యువత వెతుకుంటుంది. అందులో భాగంగానే రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ఓ ఫామ్ హౌస్ పై ఎస్వోటీ పోలీసులు (Police) దాడి చేశారు.
Also Read: MLA Kadiyam Srihari: అభ్యర్థుల ఎంపిక మీదే గెలిపించే బాధ్యత మీదే: కడియం శ్రీహరి
యాజమాని వ్యాపారం కోసం ఆన్‌లైన్ బుకింగ్
ఫామ్‌హౌస్ యాజమాని వ్యాపారం చేసేందుకు వేరే మార్గం లేక యువతను ఆసరా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఫామ్ హౌస్‌లను యాజమాన్యం నడిపిస్తుంది. బహిరంగంగా కాకుండా ఆన్‌లైన్ పద్దతిలో ఫామ్ హౌస్ బుకింగ్‌కి అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా యువతను ఆకర్షించేందుకు పార్టీలను ప్లానింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దూరపు కొండలు నునుపు అన్న చందంగా యువత ముందు వెనుక ఆలోచించకుండా ఫామ్ హౌస్‌లను బుకింగ్ చేసుకోని పోలీసులకు దోరికిపోతున్నారు. ఒకో వ్యక్తికి రూ1300 ఫీజు చెల్లిస్తే అన్ని హంగులతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆన్లైన్లో వివరించారు. బాధ్యతయుతగల పౌరులు తప్పుడు పద్దతులను ప్రోత్సహించడం చట్టరిత్య నేరం. అయినప్పటికి ఇవేవి పట్టించుకోకుండా ఫామ్ హౌస్ యాజమాన్యం ధనర్జానే ధ్యేయంగా పనిచేయడం సిగ్గు చేటు.
మైనర్లు సైతం డ్రగ్స్‌కు బానిస
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పెద్ద గ్రామ శివారులోని చెర్రీ ఓక్స్ ఫామ్ హౌస్‌పై ఆదివారం రాత్రి ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 50 మంది వరకు యువతి, యువకులు ఉన్నట్లు సమాచారం. వీరందరూ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈవిషయం గుట్టు చప్పుడు కాకుండా ముగించాలని పోలీసులు అభిప్రాయ పడ్డట్లు అనుమానం. పట్టుబడిన యువతకు నార్కోటిక్ పరీక్షలు జరపగా మద్యం, డ్రగ్స్ సేవించినట్లు తెలుస్తోంది. ఇద్దరు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు ప్రచారం సాగుతుంది. ఈ పార్టీలో అత్యధిక మంది మైనర్ యువత పాల్గోన్నట్లు సమాచారం. ఇప్పటికి పోలీసులు సమాచారం గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావునిస్తోంది.
Also Read: OG Collections: విధ్వంసం.. ‘ఓజీ’ మూవీ 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం ఎంతంటే?
