MLA Kadiyam Srihari: అభ్యర్థుల ఎంపిక మీదే.. వారి గెలుపు బాధ్యత మీదే అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సత్యసాయి కన్వెన్షన్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య(kadiyam Kavya), స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చాయూత వాతావరణం ఎక్కువగా ఉంటుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి బలంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 250 మంది ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాబోతున్నారని మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గెలిచే అభ్యర్థులకే అవకాశాలు వస్తాయని సూచించారు.
మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం..
గ్రామంలో సర్పంచ్, ఎంపిటిసిలను గెలిపించిన వారే నాయకులని అన్నారు. రాబోయే రోజుల్లో వారికే పదవులు లభిస్తాయని స్పష్టం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసేది మీరే గెలిపించేది కూడా మీరేనని వెల్లడించారు. 100 శాతం ఎంపిటిసి(MPTV), జడ్పిటిసి(ZPTC) స్థానాలు గెలుస్తామని, 95శాతం సర్పంచ్ స్థానాలను మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనందరి ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి, ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమేనని స్పష్టం చేశారు. బీజే(BJP)పీ పార్టీకి తెలంగాణ పైన, బిసిలపైన ప్రేమ లేదని అన్నారు. బిసి రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఉలుకు పలుకు లేదని తెలిపారు. బిజెపికి కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మాత్రమే తెలుసని విమర్శించారు. కేసీఆర్(KVR), కేటీఆర్(KTR) ల అవినీతి బాగోతాలు బయటపెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. వందల ఎకరాల భూములు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీష్ రావు కాళేశ్వరంలో ఇరుక్కుంటే, కేటీఆర్(KTR) కార్ రెస్ లో, కవిత(kavitha) లిక్కర్ కేసులో ఇరుక్కున్నారని ఏద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం కేసుల పాలైందని అన్నారు.
ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ..
నియోజకవర్గంలో మనందరి లక్ష్యం కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఒక్కటే నని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు గత 10 ఏళ్లుగా కడుపు కట్టుకొని పని చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మిమ్ములను గెలిపించే బాధ్యత మాదేనని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో 1000 కోట్ల అభివృద్ధి జరగలేదని అది ఒక్క కడియం శ్రీహరికే సాధ్యం అయిందని స్పష్టం చేశారు. గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ, ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు శివరాజ్ యాదవ్, లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్, జీడికల్ ఆలయ కమిటీ చైర్మన్లు శ్రీధర్ రావు, మూర్తి, పీఏసీఎస్ చైర్మన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటిసిలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అభివృద్దికి సర్కారు ప్రాధాన్యత.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
