Attack on Petrol Bunk: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ పిలుపునిచ్చిన ‘తెలంగాణ బంద్’ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో బంద్ కొనసాగుతోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. చాలాచోట్ల వ్యాపారస్తులు, వర్తకులు, పలు సంఘాలు స్వచ్ఛంగా బంద్‌లో పాల్గొన్నాయి. అయితే, బంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో అనూహ్యమైన ఘటన జరిగింది. నగరంలోని ఒక పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారు. సిటీలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో తెరిచి ఉన్న ఒక పెట్రోల్ బంక్‌పై (Attack on Petrol Bunk) ఈ దాడి చేశారు.
సామగ్రిని ధ్వంసం చేయడం, సిబ్బందిపైకి రాళ్లు రువ్వడం వైరల్‌గా మారిన ఓ వీడియోలో కనిపించాయి. బీసీ సంఘాల నేతల దాడి నేపథ్యంలో సిబ్బంది వెంటనే పెట్రోల్ బంక్‌ను మూసివేశారు.
Read Also- Telugu movies: థియేటర్లలో వందల రోజులు ఆడే సినిమాలు ఇప్పుడెందుకు ఆడటంలేదు.. రిజన్ ఇదే..
బ్రేకింగ్ న్యూస్
పెట్రోల్ బంక్ పై దాడికి పాల్పడ్డ బీసీ సంఘం నాయకులు
హైదరాబాద్ – నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో బీసీ బంద్ నేపధ్యంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ పై దాడి చేసిన బీసీ సంఘాల నేతలు pic.twitter.com/DIZbwJX8Gq
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) October 18, 2025
రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్
తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లోనూ బీసీ సంఘాల నాయకులు రోడ్లపైకి నిరసన తెలుపుతున్నారు. అధికార కాంగ్రెస్ సహా, అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయం తర్వాత, తిరిగి అలాంటి వాతావరణం కనిపిస్తోందంటూ బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే, బంద్ ప్రభావం సామాన్య ప్రజానీకంపై పడింది. ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో చాలా బస్ స్టాప్‌లు, బస్ స్టాండ్లలో ప్రయాణికులు కనిపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సెలవుదినం కావడం, ముందు ఆదివారం కూడా హాలిడే కావడంతో శనివారం బయలుదేరి స్వస్థలాలకు చేరుకోవాలనుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పండుగ ముందు సామాన్యులను ఇబ్బందిపెట్టినట్టు అయిందని పలువురు సామాన్యులు నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు, స్కూళ్లు, కాలేజీల బస్సులన్నీ నిలిచిపోయాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ పలు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. నిత్యం ప్రయాణికులతో కిక్కిరి ఉండే హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేజీఎస్ బస్టాండ్లు, వివిధ రద్దీ బస్ స్టాప్‌లు వెలవెలబోతున్నాయి.
Read Also- Jubilee Hills Bypoll: నామినేషన్ సమర్పించిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
